కళ్యాణ్ రామ్ ‘డూ ఆర్ డై’

118, ఎంత మంచి వాడవురా సినిమాల తరువాత కళ్యాణ్ రామ్ సినిమా ఏదీ ఇంకా విడుదల కాలేదు. కొత్త దర్శకుడు వాశిష్టతో ఓ భారీ సినిమా నిర్మణంలో వుంది. అది కాకుండా ఈస్ట్ కోస్ట్…

118, ఎంత మంచి వాడవురా సినిమాల తరువాత కళ్యాణ్ రామ్ సినిమా ఏదీ ఇంకా విడుదల కాలేదు. కొత్త దర్శకుడు వాశిష్టతో ఓ భారీ సినిమా నిర్మణంలో వుంది. అది కాకుండా ఈస్ట్ కోస్ట్ సంస్థ ఒకటి, దిల్ రాజు నిర్మాణంలో మరోటి ప్లానింగ్ లో వున్నాయి.

వీటిల్లో దిల్ రాజు నిర్మించే థ్రిల్లర్ కు 'డూ ఆర్ డై' అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. ప్రస్తుతం చేస్తున్న సినిమాకు పారలల్ గా ఈ సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

కొత్త దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తారు. వాస్తవానికి కళ్యాణ్ రామ్ స్వంత బ్యానర్ మీద నిర్మించే భారీ సినిమా కన్నా, ఈ సినిమానే ముందుగా విడుదల కావడానికి అవకాశం ఎక్కువ వుంది. 

ఈ మూడు సినిమాలు కాకుండా సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో కూడా కళ్యాణ్ రామ్ ఓసినిమా చేసే ప్లాన్ లో వున్నారు.

వ‌చ్చే సంవ‌త్స‌రం పెళ్లి చేసుకుంటాను