కేటీఆర్ కు సీఎం పీఠంపై మళ్ళీ ప్రచారం షురూ

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ త్వరలో ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నాడనే ప్రచారం మళ్ళీ ఊపందుకుంటోంది. Advertisement ఒకప్పుడు ఈ ప్రచారం జోరుగా సాగినప్పుడు కేటీఆర్ తోసిపుచ్చాడు. అప్పట్లో మంత్రులే కేటీఆర్ ముఖ్యమంత్రి…

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ త్వరలో ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నాడనే ప్రచారం మళ్ళీ ఊపందుకుంటోంది.

ఒకప్పుడు ఈ ప్రచారం జోరుగా సాగినప్పుడు కేటీఆర్ తోసిపుచ్చాడు. అప్పట్లో మంత్రులే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడంటూ  ప్రచారం చేశారు. 

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళతారని అనుకున్నప్పుడు దేశ్ కీ నేత కేసీఆర్ అని మంత్రులు, నాయకులు నినాదాలు చేశారు. అదే సమయంలో కేటీఆర్ సీఎం అవుతాడని చెప్పారు. కేసీఆర్ జాతీయ రాజకీయ ప్రవేశ ప్రయత్నాలు ముందుకు సాగకపోవడంతో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని మంత్రులు పదే పదే చెప్పడం మానేశారు.

ప్రస్తుతం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ప్రయత్నాలు ఏమీ చేయకపోయినా కొన్నిరోజులుగా త్వరలో కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడనే ప్రచారం జరుగుతోంది. మొన్న టీఆరెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రెడ్యా నాయక్ మార్చిలోగానే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పాడు. 

తాజాగా బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందనరావు ఇదే మాట చెప్పాడు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవాలంటే కేటీఆర్ ను సీఎం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. 

తెలంగాణలో బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్న టీఆర్ఎస్.. మళ్లీ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలో ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా సీఎం కేసీఆర్ అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇందులో భాగంగా వచ్చే ఏడాది తన కుమారుడు, మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు జోస్యం చెప్పాడు.  కేసీఆర్ అనారోగ్యంతో ఉన్నారని.. అందుకే మార్చిలో కేటీఆర్‌ను సీఎం చేయాలని అనుకుంటున్నారని రఘునందన్ రావు చెప్పాడు. 

2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాషాయం జెండా ఎగరవస్తామని రఘునందన్ రావు ధీమా వ్యక్తం చేశాడు.  కేటీఆర్‌ను సీఎం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారనే ఊహాగానాలు కొద్దిరోజులుగా వినిపిస్తున్నాయి. 

ఇదే అంశంపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీమంత్రి రెడ్యానాయక్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.  మార్చిలోపు మంత్రి కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టే అవకాశముందని జోస్యం చెప్పాడు. తాజాగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఇదే విషయం చెప్పడంతో దీనిపై రాజకీయవర్గాల్లో మరింత చర్చ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నిజానికి కేటీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారనే వార్తలు ఈ ఏడాది మొదట్లో బాగా వినిపించాయి. ఇందుకోసం కేసీఆర్ ముహూర్తం కూడా ఖరారు చేశారనే ప్రచారం సాగింది. అయితే కరోనా లాక్‌డౌన్, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడింది. 

అయితే తాజాగా కొద్దిరోజుల నుంచి కేటీఆర్‌ను సీఎం చేస్తారనే టాక్ మొదలైంది. అయితే ఇలాంటి ఊహాగానాలు వచ్చినప్పుడల్లా మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇస్తుండేవారు. దీంతో ఇప్పుడు కూడా ఈ అంశంపై మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇస్తేనే.. ఇలాంటి వార్తలకు చెక్ పడుతుందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

రాయ‌పాటి రాజ‌కీయం,వ్యాపారం