త్రివిక్రమ్ పై పవన్ ఫ్యాన్స్ కోపం

దర్శకుడు త్రివిక్రమ్ మీద సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ కోపం మామూలుగా లేదు. ముఖ్యంగా ట్విట్టర్ వంటి మాద్యమాల్లో త్రివిక్రమ్ మీద పవన్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు.  Advertisement పవన్ ను త్రివిక్రమ్ తప్పు దారి…

దర్శకుడు త్రివిక్రమ్ మీద సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ కోపం మామూలుగా లేదు. ముఖ్యంగా ట్విట్టర్ వంటి మాద్యమాల్లో త్రివిక్రమ్ మీద పవన్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు. 

పవన్ ను త్రివిక్రమ్ తప్పు దారి పట్టిస్తున్నారని వారు భావిస్తున్నారు. ముఖ్యంగా స్ట్రయిట్ కథలు చేయనీయకుండా రీమేక్ లు చేయిస్తున్నారని ప్యాన్స్ ఫీలవుతున్నారు.

అసలే ఈ మధ్య నిర్మాత బండ్ల గణేష్ దర్శకుడు త్రివిక్రమ్ ను తప్పు పట్టిన ఓ అడియో లీక్ అయింది. అదంతా నిజ‌మే అని పవన్ ఫ్యాన్స్ నమ్ముతున్నారు. లేటెస్ట్ గా సాయి ధరమ్ తేజ్..పవన్ కాంబినేషన్ లో తమిళ రీమేక్ చేయబోతున్నారన్న వార్తలు రావడం పవన్ ఫ్యాన్స్ ను మరింతగా కలవరపెడుతున్నాయి.

నిజానికి అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ అయిన భీమ్లా నాయక్ ఫ్యాన్స్ ను పూర్తిగా సంతృప్తి పరచలేదు. అది వాస్తవం. పైకి ఏమీ అనలేక ఫ్యాన్స్ దాన్ని భరించారు. ఆ సినిమాలో రానా పాత్ర కు మంచి పేరు వచ్చింది. 

ఇప్పుడు మళ్లీ రీమేక్ అనేసరికి ఫ్యాన్స్ తట్టుకోలేక, ఇదంతా త్రివిక్రమ్ నే చేస్తున్నారని, ఆయనపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే మెగా బ్రదర్స్ ఇద్దరూ వరుసపెట్టి రీమేక్ లు చేస్తున్నారనే ట్రోలింగ్ సోషల్ మీడియాలో వుంది. 

బాబీ డైరక్షన్ సినిమా మినహా మరే సినిమాను మెగాస్టార్ స్ట్రయిట్ కథతో చేయడం లేదు. పవన్ వకీల్ సాబ్, భీమ్లా నాయక్ రెండూ రీమేక్ లే. ఇప్పుడు మరో రీమేక్ అనే సరికి ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు.