రజినీ ఇన్ పేషెంట్.. పార్టీ ప్రకటన డౌట్

రజినీకాంత్ కి కేవలం బీపీ సమస్యలే ఉన్నాయని చెబుతూనే.. ఆయన ఇంకో రోజు ఆస్పత్రిలోనే ఉండాలని, పూర్తిగా అన్ని పరీక్షలు చేయాలని చెబుతున్నారు అపోలో వైద్యులు. ఒకే రోజు రెండు హెల్త్ బులిటెన్లు విడుదల…

రజినీకాంత్ కి కేవలం బీపీ సమస్యలే ఉన్నాయని చెబుతూనే.. ఆయన ఇంకో రోజు ఆస్పత్రిలోనే ఉండాలని, పూర్తిగా అన్ని పరీక్షలు చేయాలని చెబుతున్నారు అపోలో వైద్యులు. ఒకే రోజు రెండు హెల్త్ బులిటెన్లు విడుదల చేసి ఆయన అభిమానుల్లో లేనిపోని కలవరం క్రియేట్ చేశారు.

ఇప్పటికే చాలాసార్లు రజినీకాంత్ అనారోగ్యానికి గురికావడం, విదేశాల్లో సైతం చికిత్స తీసుకుని రావడం అన్నీ చూశాం. కానీ ఈ దఫా రజినీ ఆరోగ్యంపై ప్రజల్లో మరింత టెన్షన్ ఎక్కువవడానికి కారణం ఏంటంటే.. ఆయన రాజకీయ పార్టీ ప్రకటన.

ఈనెల 31న పార్టీ ప్రకటన, జనవరి 1 నుంచి రాజకీయ రణక్షేత్రంలో దూకాలని సూపర్ స్టార్ ఉబలాటపడ్డారు. రెండు వారాల గ్యాప్ ని కూడా సద్వినియోగం చేసుకోవాలని సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. టైమ్ బ్యాడ్, యూనిట్ లో కొంతమందికి కరోనా సోకడంతో షూటింగ్ ఆగిపోయింది. రజినీకి కొవిడ్ నెగెటివ్ రావడం ఒక్కటే కాస్త సంతోషించదగ్గ విషయం.

కానీ అనుకోకుండా అనారోగ్యం తిరగబెట్టింది. బీపీలాంటి సమస్య ఎక్కువయింది కాబట్టి.. ఈ దశలో ఆయనకు పూర్తిగా రెస్ట్ అవసరం. పార్టీ ప్రకటన, కార్యాచరణ అంటూ ఆవేశ పడి, శారీరకంగా, మానసికంగా ఆందోళన చెందితే మొదటికే మోసం వస్తుంది. 

ఇన్నాళ్లూ.. పార్టీ ప్రకటన వాయిదా వేస్తూ వచ్చిన రజినీ.. ఇప్పుడు అనారోగ్యంగా ఉన్న సమయంలో హడావిడిగా ఆ పని చేసి, లేనిపోని ఇబ్బందులు ఎందుకు కొని తెచ్చుకుంటారు. ఆ వాయిదాల్లో, ఇది మరో వాయిదా అవుతుంది అంతే.

ఇప్పటికిప్పుడు రజినీ డిశ్చార్జి అయినా ఆయనను చెన్నైకి తరలించే అవకాశాలు తక్కువ. హైదరాబాద్ లోనే రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించే అవకాశాలే ఎక్కువ. ఇలాంటి టైమ్ లో రజినీ పార్టీని ప్రకటించాలని, విమర్శలు-ప్రతివిమర్శలతో వైరి పక్షాలను రెచ్చగొట్టి, తానూ రెచ్చిపోవాలని ఎవరూ ఆశించరు. అలా ఆశించేవారు ఆయన అభిమానులు కారు కూడా.

అందుకే పార్టీ ప్రకటన వ్యవహారంపై ఆయన అభిమానులు సైలెంట్ గా ఉన్నారు. దాదాపుగా రజినీకాంత్ కొత్త పార్టీ ప్రకటన సైలెంట్ గానే వాయిదా పడిందని అర్థమవుతోంది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని ఆవేశంగా మాట్లాడిన సూపర్ స్టార్.. ఈసారి కూడా తన పార్టీ ప్రకటనను వాయిదా వేసే అవకాశాలే కనిపిస్తున్నాయి.

వ‌చ్చే సంవ‌త్స‌రం పెళ్లి చేసుకుంటాను