అస్సలు ఓ వార్త లేదు..ఓ హడావుడి లేదు. పెద్దగా పబ్లిసిటీ లేదు. లీడింగ్ లో వున్న టాప్ బయర్లు సినిమాను కొనలేదు. వెస్ట్ గోదావరి లోకల్ బయ్యర్ టోటల్ ఏపీ, తెలంగాణ అయిదు కోట్లకు తీసుకుని, తన స్నేహితులైన బయ్యర్లు అందరి చేతిలో వుంచారు ఏరియా వైజ్ గా. అది కూడా పెద్ద పెద్ద మొత్తాలు తీసుకోలేదు. ఉత్తరాంధ్ర 45 లక్షలకు కాస్త ఇటుగానే. నైజాం కోటి రూపాయలు మాత్రమే.
తొలి రోజు నైజాంలో 65 లక్షలకు కాస్త అటు ఇటుగా, ఉత్తరాంధ్రలో 36 లక్షలు తొలి రోజే వసూలు చేసింది. కృష్ణా జిల్లాకు తొలి రోజు 19 లక్షల షేర్ వచ్చింది. మహా మహా పెద్ద పెద్ద సినిమాలు కూడా ఈ రేంజ్ తొలి రోజు తెచ్చుకోలేదు.
బిచ్చగాడు తెలుగు నాట అప్పట్లో మామూలు హిట్ కాదు. అరి వీర భయంకరమైన హిట్. తెలుగు ప్రేక్షకుల మదిలోంచి బిచ్చగాడు ఇమేజ్ ఇప్పటికీ చెరిగిపోలేదు అని సీక్వెల్ విడుదల అయిన తరువాత కానీ క్లారిటీ రాలేదు. ఆ క్లారిటీ ముందే వుండి వుంటే ఈ సినిమా రైట్స్ కోసం మహా మహులు పోటీ పడేవారు.
నిజానికి బిచ్చగాడు 2 సినిమాకు సరైన టాక్ రాలేదు. బిచ్చగాడు వన్ కు వచ్చిన టాక్ వచ్చి వుంటే లెక్కలు కట్టడం అంత సులువు అయ్యేది కాదు.
కానీ ఇప్పుడు ట్రెండ్ చూస్తుంటే నైజాంలోనే నాలుగు కోట్లకు పైగా చేసేలా వుంది. ఈ లెక్కన బిచ్చగాడు 3 ప్లాన్ చేసినా ఆశ్చర్యం లేదు.