కాజోల్ క్రిస్మస్ కోరిక ఇదే

క్రిస్మస్ కు ఏదైనా కోరుకుంటే శాంటా తీరుస్తాడని, బహుమతులు అందిస్తాడని అంతా నమ్ముతారు. అందుకే కాజోల్ కూడా ఈ క్రిస్మస్ కు ఒకటి కోరుకుంది. అయితే ఆ కోరిక తన కోసం మాత్రమే కాదు,…

క్రిస్మస్ కు ఏదైనా కోరుకుంటే శాంటా తీరుస్తాడని, బహుమతులు అందిస్తాడని అంతా నమ్ముతారు. అందుకే కాజోల్ కూడా ఈ క్రిస్మస్ కు ఒకటి కోరుకుంది. అయితే ఆ కోరిక తన కోసం మాత్రమే కాదు, మనందరి కోసం. ఇంతకీ ఆ కోరిక ఏంటో చూద్దాం.

“మనం ఈ ప్రపంచాన్ని నడిపిస్తున్న విధానం మరింత మెరుగ్గా, మంచిగా మారుతోందని ఎవరో నాకు చెప్పారు. అయితే ఈ ప్రాసెస్ లో భాగంగా మనం కఠినమైన, అతి చెత్త సర్దుబాట్లు కొన్ని ఎదుర్కొంటున్నాం. మంచి ప్రపంచం కోసం, మరింత మంచి భవిష్యత్ కోసం. ఈ క్రిస్మస్ కు నా కోరిక ఇదే”

ఇలా తన కోరికను బయటపెట్టింది కాజోల్. క్రిస్మస్ సందర్భంగా అందరికీ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు అందించిన కాజోల్.. తన కుటుంబానికి చెందిన కొన్ని ఫొటోల్ని కూడా షేర్ చేసింది.

అందులో భర్త అజయ్ దేవగన్ తో పాటు.. తల్లి తనూజ, పిల్లల యుగ్, నైసా కూడా ఉన్నారు. అంతేకాదు, తను స్వయంగా అలంకరించిన క్రిస్మస్ ట్రీ ఫొటోను కూడా అభిమానులతో పంచుకుంది.

ప్రస్తుతం ఈ సీనియర్ నటి త్రిభంగ అనే సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఇది నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతోంది. 

సోహైల్ చాలా తెలివైనోడు