ఎలాంటి హీరోతోనైనా నటన రాబట్టుకోవడం తేజ స్పెషాలిటీ. కొత్త నటీనటులతో కూడా మంచి పెర్ఫార్మెన్స్ రాబట్టుకుంటాడనే ఇమేజ్ తేజకు ఉంది. ఈ క్రమంలో అవసరమైతే నటీనటుల్ని ఈ దర్శకుడు కొడతాడనే రిమాక్క్ కూడా ఉంది. ఇలాంటి దర్శకుడికే కొరకరాని కొయ్యగా మారాడంట దగ్గుబాటి అభిరామ్.
సురేష్ బాబు చిన్న కొడుకు దగ్గుబాటి అభిరామ్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. తేజ దర్శకత్వంలో అహింస అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో అభిరామ్ తో యాక్టింగ్ చేయించడానికి అష్టకష్టాలు పడ్డాడంట తేజ.
మరీ ముఖ్యంగా క్లయిమాక్స్ లో అభిరామ్ తో సన్నివేశాలు తీయడం చాలా ఇబ్బందిగా మారిందట. మరోవైపు హీరోయిన్ కొత్తమ్మాయి అయినప్పటికీ, చక్కగా చేస్తుంటే.. ఇటు అభిరామ్ మాత్రం ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం లేదంట.
అలా చాలా రోజులు ప్రయత్నించిన తర్వాత దర్శకుడు తేజ, తన అనుభవాన్ని అంతా రంగరించి, క్లయిమాక్స్ పార్ట్ కోసం ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చాడు. అదేంటంటే.. హీరో కనిపించకుండా క్లయిమాక్స్ ఫైట్ షూట్ చేశాడట తేజ.
అవును.. అహింస సినిమా క్లయిమాక్స్ ఫైట్ లో హీరో కనిపించడంట. కానీ హీరోనే ఫైట్ చేస్తున్న ఫీలింగ్ ప్రేక్షకుడికి కలుగుతుందంట. అలా ఏదో జిమ్మిక్కు చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి అభిరామ్ తో యాక్టింగ్ చేయించడం, తేజ లాంటి దర్శకుడి వల్లే కాలేదంటే, కాస్త ఆలోచించాల్సిన విషయమే.
అన్నట్టు ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. తాజాగా జూన్ 2 డేట్ వేశారు. ఆ తేదీకైనా సినిమా వస్తుందా రాదా అనే అనుమానాలున్నాయి. మేకర్స్ మాత్రం ఈసారి పక్కా అంటున్నారు. వచ్చేవారం నుంచి ప్రచారం కూడా స్టార్ట్ చేస్తామంటున్నారు.