‘గీత’ దాటేసిన రవితేజ

కథ, డైరక్టర్ మాత్రమే కాదు, రెమ్యూనిరేషన్ కీలకం అని హీరో రవితేజ భావించడంతో మంచి ప్రాజెక్టు దూరం అయిపోయింది. Advertisement గీతా 2, యువి కలిసి మారుతి డైరక్షన్ లో నిర్మించాల్సిన ప్రాజెక్టు దాదాపు…

కథ, డైరక్టర్ మాత్రమే కాదు, రెమ్యూనిరేషన్ కీలకం అని హీరో రవితేజ భావించడంతో మంచి ప్రాజెక్టు దూరం అయిపోయింది.

గీతా 2, యువి కలిసి మారుతి డైరక్షన్ లో నిర్మించాల్సిన ప్రాజెక్టు దాదాపు క్యాన్సిల్ అయిపోయింది.

ఈ సినిమా కోసం హీరో రవితేజ ఇచ్చిన నాలుగు ఆప్షన్లు నిర్మాతలకు నచ్చలేదు.

ఆప్షన్ వన్- 12 కోట్లు సింగిల్ పేమెంట్

ఆప్షన్ టూ – 10 కోట్లు పేమెంట్ ప్లస్ 20 పర్సెంట్ లాభాల్లో వాటా

ఆప్షన్ త్రీ – 13 కోట్లు రెమ్యూనిరేషన్ విడతలు విడతలుగా

ఆప్షన్ ఫోర్ – అసలు రెమ్యూనిరేషన్ లేకుండా సినిమా చేసేసి, చివర్లో రవితేజ ఓ పర్సెంటేజ్ చెబుతారు. అది ఇవ్వడం. 

ఈ మూడు ఆప్షన్లకు నిర్మాతలు అంగీకరించలేదు. నైజాం కనుక 10 కోట్ల బిజినెస్ చేస్తే, 10 కోట్లు రెమ్యూనిరేషన్ ఇచ్చి, లాభాల్లో కొంత వాటా ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసారు. 

లేదా రెమ్యూనిరేషన్ లేకుండా ఏ పర్సంటేజ్ అన్నది నిర్మాణానికి ముందే చెప్పమని అడిగారు. 

తాను ఆప్షన్లు ఇస్తే, తనకే ఆప్షన్లు ఇస్తారా? అని రవితేజ కాస్త హర్ట్ కావడంతో ప్రాజెక్టు కంచికి వెళ్లిపోయింది. నిజానికి గత చాలా కాలంగా రవితేజ ఫామ్ లో లేడు. 

క్రాక్ సినిమాను లాభాల్లో వాటా పద్దతిన చేసాడు. ఆ సినిమాకు కాస్త బజ్ రావడంతో ఇప్పుడు రేటు పెంచినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం చేస్తున్న రమేష్ వర్మ సినిమాకు సింగిల్ పేమెంట్ ఆప్షన్ తో చేస్తున్నాడు. 

ప్రస్తుతం మారుతి అదే సబ్జెక్ట్ ను వేరే హీరోతో చేసే ప్రయత్నాల్లో వున్నారు. 

పవన్ రాజకీయానికి మరణ శాసనం!