అక్కినేని కాంపౌండ్ కు కాలం కలిసిరావడం లేదు. ఎవరు ఏ సినిమా చేసినా ఫ్లాప్ అవుతోంది. మొన్నటికిమొన్న ఏజెంట్ సినిమా చేశాడు అఖిల్. అతిపెద్ద డిజాస్టర్ అయింది. తాజాగా కస్టడీ సినిమాతో ప్రేక్షకులముందుకొచ్చాడు అఖిల్. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది.
ఏజెంట్ సినిమా డిజాస్టర్ అయిన కొన్ని రోజులకు అఖిల్, ఓ లెటర్ రిలీజ్ చేశాడు. సినిమా ఫ్లాప్ అయిందనే విషయాన్ని పరోక్షంగా అంగీకరిస్తూనే, ఇకపై మరింత కష్టపడతానని, అందరి నమ్మకాన్ని నిలబెడతానని ప్రకటించాడు.
సరిగ్గా ఇప్పుడు అలాంటి రెస్పాన్స్ నే నాగచైతన్య నుంచి కూడా ఆశిస్తున్నారు కొంతమంది. కస్టడీ ఫెయిల్యూర్ పై ఇప్పటివరకు ఎవ్వరూ స్పందించలేదు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుకు స్పందించాల్సిన అవసరం లేదు. నిర్మాత చిట్టూరి ఆల్రెడీ మరో సినిమాతో బిజీ అయిపోయాడు.
ఎటొచ్చి నాగచైతన్యకు మాత్రం ఈ సినిమా పెద్ద షాక్. ఎందుకంటే, ఈ మూవీ కచ్చితంగా హిట్టవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు చైతూ. ఎడిటింగ్ టేబుల్ పైనే తనకు దాదాపు రిజల్ట్ తెలిసిపోతుందని, కస్టడీ చాలా బాగా వచ్చిందని అన్నాడు. ఇంటర్వ్యూల్లో కూడా చైతూ కాన్ఫిడెన్స్ కనిపించింది.
కానీ కస్టడీ సినిమా, చైతన్యకు పెద్ద షాక్ ఇచ్చింది. ఇలాంటి టైమ్ లో నాగచైతన్య కూడా ఓ బహిరంగ లేఖ విడుదల చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. తన సినిమాలు కొన్ని ఫ్లాప్ అయ్యాయని కొన్ని సందర్భాల్లో ఓపెన్ గా రియాక్ట్ అయ్యాడు నాగచైతన్య. కాబట్టి రాబోయే రోజుల్లో అతడు కచ్చితంగా కస్టడీ రిజల్ట్ పై స్పందిస్తాడని, ఇప్పటికిప్పుడు లేఖ విడుదల చేయాల్సిన అవసరం లేదని.. అతడి ఫ్యాన్స్ వాదిస్తున్నారు.