కాలత్రిగుణ సందేశం…బ్రో

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా మోషన్ పోస్టర్ విడుదలయింది. పీపుల్స్ మీడియా పతాకం మీద విశ్వప్రసాద్, వివేక్ నిర్మించే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు ఓ మోషన్ పోస్టర్ ను…

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా మోషన్ పోస్టర్ విడుదలయింది. పీపుల్స్ మీడియా పతాకం మీద విశ్వప్రసాద్, వివేక్ నిర్మించే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ తో పాటు ఓ మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. 

ఈ సోషియో ఫాంటసీ సినిమాలో హీరో కాలస్వరూపుడిగా, భగవంతుడిగా కనిపిస్తాడు. అందుకే నేపథ్యంలో సంస్కృత పదాలు వినిపింపచేస్తూ, కాస్త కొత్తగానే వుండే నేపథ్య సంగీతాన్ని జతచేసారు మ్యూజిక్ డైరక్టర్ థమన్.

మోషన్ పోస్టర్ కాబట్టి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. పవన్ ఫిట్ గా కనిపించారు. తనకు అలవాటైన స్టయిల్ ఫోజ్ నే అది. బిజిఎమ్ వల్ల దానికి అందం వచ్చింది. బ్రో అన్న టైటిల్ ముందుగానే బయటకు రివీల్ అయిపోయింది. దాన్నే ఇప్పుడు కన్ ఫర్మ్ చేసారు.

ఈ సినిమా తమిళ సినిమా ఆధారంగా తయారవుతోంది. స్క్రిప్ట్, మాటలు త్రివిక్రమ్ శ్రీనివాస్, దర్శకత్వం సముద్రఖని. పోస్ట్ సమ్మర్ లో సినిమా విడుదలవుతుంది.