ఫ్యామిలీ సినిమానే కానీ పిండేయడాలు ఉండవు

ఆడవాళ్లు మీకు జోహార్లు.. పేరులోనే ఇది ఫ్యామిలీ సినిమా అనే విషయం తెలిసిపోతోంది. పైగా ఖుష్బూ, రాధిక, ఊర్వశి లాంటి ఎంతోమంది సీనియర్ ఆర్టిస్టులున్న సినిమా ఇది. కాబట్టి సెంటిమెంట్ పుష్కలంగా ఉంటుందని అంతా…

ఆడవాళ్లు మీకు జోహార్లు.. పేరులోనే ఇది ఫ్యామిలీ సినిమా అనే విషయం తెలిసిపోతోంది. పైగా ఖుష్బూ, రాధిక, ఊర్వశి లాంటి ఎంతోమంది సీనియర్ ఆర్టిస్టులున్న సినిమా ఇది. కాబట్టి సెంటిమెంట్ పుష్కలంగా ఉంటుందని అంతా అనుకుంటారు. కానీ అలాంటివేం ఊహించుకోవద్దంటున్నాడు హీరో శర్వానంద్.

“ఫ్యామిలీ సినిమా అనగానే అంతా కలిసి ప్రేక్షకుల్ని పిండేస్తారు, సెంటిమెంట్ పండించేస్తారని అంతా అనుకుంటారేమో. ఇది అలాంటి సినిమా కాదు. ఇందులో పిండేయడాల్లాంటివి ఉండవు. సినిమా హిలేరియస్ గా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఈ ఆడవాళ్లంతా కలిసి నన్ను పిండేశారు. ప్రేక్షకులు అది ఎంజాయ్ చేస్తారు.”

ఆడవాళ్లు మీకు జోహార్లు ట్రయిలర్ తాజాగా రిలీజైంది. ఆ ట్రయిలర్ తోనే సినిమా ఎలా ఉంటుందనే విషయాన్ని క్లియర్ గా చెప్పేశారు. కాబట్టి హెవీ సెంటిమెంట్ సీన్లు ఇందులో ఉండవని, సున్నితమైన భావాలతో ఈ సినిమా తెరకెక్కిందని చెబుతున్నాడు శర్వా.

ఈ సందర్భంగా కథల ఎంపికపై కూడా స్పందించాడు శర్వానంద్. తను నటించిన కొన్ని సినిమాలు సక్సెస్ అవుతాయని, మరికొన్ని ఫ్లాప్ అవుతాయని.. కానీ తను మాత్రం డిఫరెంట్ స్క్రిప్టులు ఎంచుకున్నానా లేదా అనే విషయాన్ని మాత్రమే ఆలోచిస్తానంటున్నాడు. 

అయితే ఈసారి ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాకు మాత్రం తను కోరుకునే కొత్త కథతో పాటు.. మ్యూజిక్, ఆర్టిస్టులు, డైరక్టర్.. ఇలా అన్నీ కుదిరాయంటున్నాడు.