జూనియర్ జాతిరత్నాలు

జాతిరత్నాలు సినిమా బ్లాక్ బస్టర్. అది కాదు విషయం. దాని ప్రభావం తరువాత తరువాత వచ్చే సినిమాల మీద ఎంతో కొంత పడింది. ఈనెల 26న విడుదలవుతున్న మేము ఫేమస్ సినిమా మీద మరీ…

జాతిరత్నాలు సినిమా బ్లాక్ బస్టర్. అది కాదు విషయం. దాని ప్రభావం తరువాత తరువాత వచ్చే సినిమాల మీద ఎంతో కొంత పడింది. ఈనెల 26న విడుదలవుతున్న మేము ఫేమస్ సినిమా మీద మరీ ఎక్కువగా పడినట్లుంది.

ఈ సినిమా ట్రయిలర్ విడుదలయింది. టీజర్ చూసినపుడు కలిగిన ‘జాతిరత్నాలు’ ఒపీనియన్ నే ట్రయిలర్ చూసాకా కలిగింది.

అనగనగా ఓ పల్లెటూరు. ముగ్గురు అల్లరి చిల్లరి కుర్రాళ్లు. వాటితో పుట్టే ఫన్. ఫేమస్ కావాల్సిన పరిస్థితులు. ఆ కారణంగా పుట్టే భావోద్వేగాలు. వెరసి మేము ఫేమస్ సినిమా అని అర్థం అవుతోంది.

పంచ్ ఫలక్ నుమాలు..యూత్ ఫుల్ వ్యవహారాలు అడిషనల్ బోనస్. ఎటొచ్చీ జాతిరత్నాలు సినిమాలో కనిపించని గ్లామర్ వుంది. సినిమా టౌన్ కు షిఫ్ట్ అయ్యాక కలర్ వస్తుంది. మేము ఫేమస్ కొత్త కుర్రాళ్లు, టోటల్ విలేజ్ బ్యాక్ గ్రవుండ్ తో గ్లామర్ అద్దకం కాస్త తగ్గింది.

సినిమాలో ఇప్పటికే రెండు పాటలు బాగున్నాయి అనిపించుకున్నాయి. అందువల్ల పంచ్ లు, సరదా సందడులు ఏమాత్రం బాగున్నా, మరో చిన్న సినిమా పెద్ద హిట్ అనిపించుకుంటుంది.