రాను రాను టాప్ హీరోల రెమ్యూనిరేషన్లు టాప్ లేచిపోయే రేంజ్ కు వెళ్లిపోతున్నాయి. తెలుగునాట మాత్రమే కాదు. తమిళనాట కూడా ఇదే పరిస్థితి. తమిళ హీరో విజయ్ వారసుడు సినిమాకు వంద కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకున్నారని వార్తలు వున్నాయి.
ఇప్పుడు తన రికార్డును తనే బ్రేక్ చేస్తున్నారని బోగట్టా. ఓ సినిమాను విజయ్ 150 కోట్ల రెమ్యూనిరేషన్ కు ఓకె చేసారని చెన్నయ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది.
వెంకట్ ప్రభు డైరక్షన్ లో ఓ సినిమా చేయడానికి విజయ్ ఓకె చేసారని తెలుస్తోంది. ఎజిఎస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఈ సినిమా కోసం విజయ్ కు ఏకంగా 150 కోట్లు రెమ్యూనిరేషన్ ఆఫర్ చేసారని తెలుస్తోంది.
విజయ్ తో సినిమా చేస్తే, హిట్, ఫ్లాప్, యావరేజ్ అనే విషయంతో సంబంధం లేకుండా మంచి లాభాలు వస్తున్నాయి. కేవలం నాన్ థియేటర్ హక్కుల మీదే వస్తోంది. అందువల్ల విజయ్ రెమ్యూనిరేషన్ అంతకు అంతా పెరుగుతూ వస్తోంది.
మొత్తం మీద ప్రస్తుతానికి వెంకట్ ప్రభుతో విజయ్ ఓ సినిమా ఓకే చేసారని, దానికి 150 కోట్ల రెమ్యూనిరేషన్ అని చెన్నయ్ వర్గాల బోగట్టా. ఇదిలా వుంటే విజయ్ తెలుగు సినిమా చేయబోతున్నారని, తెలుగు దర్శకుడు పని చేస్తారని వార్తలు వినిపించాయి.
కానీ ప్రస్తుతానికి విజయ్ ఆ ప్రాజెక్టును పక్కన పెట్టారని తెలుస్తోంది. ఈ సినిమాను ఆర్బీ చౌదరి నిర్మించాల్సి వుంది. కానీ దానికి కథ సెట్ కాలేదని టాక్.