ఈ మాట మేం చెప్పడం లేదు. బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి డేటింగ్ లో ఉన్నారంటూ ఇప్పటికే చాలా ప్రచారం నడిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని ఈ హీరోహీరోయిన్లిద్దరూ కన్ ఫర్మ్ చేయలేదు, అలా అని ఖండించనూలేదు.
ఇప్పుడీ జంట పెళ్లికి రెడీ అవుతోందట. అంతేకాదు, వచ్చే నెలలో నిశ్చితార్థం కూడా పెట్టుకున్నారట. ఓ ప్రముఖ బాలీవుడ్ సైట్ 'ఎక్స్ క్లూజివ్' అంటూ ఈ మేటర్ ను బయటపెట్టింది.
వీళ్ల పెళ్లి, ఎంగేజ్ మెంట్ కబుర్లు జనాలకు కొత్త కాదు. డిసెంబర్ 31 టైమ్ లో కూడా ఇలాంటి 'ఎక్స్ క్లూజివ్' కబుర్లు చాలానే వచ్చాయి. వరుణ్ తేజ్ ఖరీదైన ఉంగరం కొన్నాడని, గోవాలో ఆ హీరోయిన్ కు ప్రపోజ్ చేయబోతున్నాడంటూ కథనాలు వచ్చాయి. వాటిపై స్పందించింది లావణ్య త్రిపాఠి, ప్రస్తుతం తను ఉత్తరాఖండ్ లో ఉన్నానంటూ పరోక్షంగా ఆ వార్తల్ని ఖండించింది కూడా.
అయినప్పటికీ వీళ్ల డేటింగ్ పై పుకార్లు వస్తూనే ఉన్నాయి. వరుణ్ తేజ్ చెల్లెలు నిహారిక, లావణ్య మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి ఒకప్పుడు జిమ్ కు వెళ్లేవారు. అలా వరుణ్ తేజ్ తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వరుణ్-లావణ్య కలిసి 2 సినిమాలు కూడా చేశారు. ఈ క్రమంలో ఇద్దరూ ప్రేమలో పడినట్టు వార్తలొచ్చాయి.
మరోవైపు గతంలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూడా ఈ పుకార్లకు ఊతమిస్తున్నాయి. 2023లో ఎట్టిపరిస్థితుల్లో వరుణ్ తేజ్ పెళ్లి అయిపోతుందని, గతేడాది నాగబాబు ప్రకటించారు. సో.. అప్పటికే నాగబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్టుంది. చూస్తుంటే, ఈసారి పుకార్లు నిజమయ్యేలా ఉన్నాయి.