జగన్ పుట్టింది ఎందుకో చెప్పిన వైసీపీ మంత్రి

పుట్టిన రోజూ పండుగే అందరికీ, పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి అని మహాకవి డాక్టర్ సి నారాయణరెడ్డి రాసిన తెలుగు పాట ఒకటి ఉంది. అలా అక్షరాలా జగన్ కారణ జన్ముడు అని వైసీపీ…

పుట్టిన రోజూ పండుగే అందరికీ, పుట్టింది ఎందుకో తెలిసేది ఎందరికి అని మహాకవి డాక్టర్ సి నారాయణరెడ్డి రాసిన తెలుగు పాట ఒకటి ఉంది. అలా అక్షరాలా జగన్ కారణ జన్ముడు అని వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కొనియాడారు.

జగన్ పుట్టింది పేదల కోసం, వారి జీవితాలలో వెలుగులు నింపడం కోసం అంటూ సరైన భాష్యమే చెప్పారు. విశాఖలో అంగరంగ వైభవంగా జరిగిన జగన్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న  మంత్రి దేశంలో ఏ సీఎం చేయని విధంగా  జగన్ పాలన కొనసాగిస్తున్నాడని కీర్తించారు.

సంక్షేమ రాజ్యం అంటే అంతా ఏపీ వైపే చూసేలా జగన్ పాలన సాగుతోందని కూడా అన్నారు. విపక్షాలు జగన్ అభివృద్ధిని, సంక్షేమాన్ని అడ్డుకోవాలని చూడడం దారుణం బాధాకరమని కూడా అన్నారు. 

ఎవరెన్ని అడ్డనుకులు సృష్టించినా జగన్నాధ రధం ఆగేది కాదని కూడా మంత్రి క్లారిటీగా చెప్పేశారు. మొత్తానికి నారాయణరెడ్డి రాసిన పాటకు జగన్ పుట్టిన రోజున మంత్రి సరైన భాష్యమే చెప్పారని అంటున్నారు.

అచెన్న రిపేర్లు చెయ్యగలడా?