రానా కు అయిదు కోట్లు

అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ లో నటించేందుకు పచ్చజెండా ఊపాడు హీరో రానా. ఈ మల్టీ స్టారర్ లో నటించేందుకు రానా రెమ్యూనిరేషన్ ఎంత అన్నది ఆసక్తికరమైన విషయం. Advertisement బాహుబలి సిరీస్ ను పక్కన…

అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ లో నటించేందుకు పచ్చజెండా ఊపాడు హీరో రానా. ఈ మల్టీ స్టారర్ లో నటించేందుకు రానా రెమ్యూనిరేషన్ ఎంత అన్నది ఆసక్తికరమైన విషయం.

బాహుబలి సిరీస్ ను పక్కన పెడితే రానా ఇంకా మాంచి మార్కెట్ సాధించిన సినిమాలు ఏవీ అందించలేదు. కానీ పాన్ ఇండియా రికగ్నైజేషన్ అయితే వుంది. కానీ అయ్యప్పన్ కోషియమ్ రీమేక్ పాన్ ఇండియా సినిమా కాదు. 

తమిళంలో వేరే తయారవుతోంది. హిందీలో కూడా ప్లానింగ్ లో వుంది. అందువల్ల ఈ సినిమాకు ఓన్లీ తెలుగు అనే లెక్కలోనే రెమ్యూనిరేషన్ వుంటుంది. విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం రానా రెమ్యూనిరేషన్ అయిదు కోట్లు అని తెలుస్తోంది. 

వాస్తవానికి రానా అయిదు కోట్లకు పైనే రెమ్యూనిరేషన్ తీసుకుంటాడని, కానీ ఈ సినిమాకు వర్కింగ్ డేస్ అవీ చాలా తక్కువ కావడం వల్ల అయిదు తీసుకుంటున్నాడని తెలుస్తోంది.

అచెన్న రిపేర్లు చెయ్యగలడా?