రాజ‌కీయంగా ఉప్పునిప్పు…కానీ జ‌గ‌న్‌కు విషెస్

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబునాయుడి నుంచి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అందాయి. అలాగే ఎల్ల‌ప్పుడూ సంతోషంగా, ఆనందంగా జీవించాల‌ని చంద్ర‌బాబు ఆశీస్సులు కూడా తెలిపారు.  Advertisement ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్…

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబునాయుడి నుంచి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అందాయి. అలాగే ఎల్ల‌ప్పుడూ సంతోషంగా, ఆనందంగా జీవించాల‌ని చంద్ర‌బాబు ఆశీస్సులు కూడా తెలిపారు. 

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పుట్టిన రోజు పుర‌స్క‌రించుకుని సోమ‌వారం ప‌లువురు రాజ‌కీయ‌, సినీ, ఇత‌ర రంగాల ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా, మెయిన్‌స్ట్రీమ్ మీడియా వేదిక‌గా శుభాకాంక్ష‌లు వెల్లువెత్తిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా 48వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న జ‌గ‌న్‌కు చంద్ర‌బాబు శుభాకాంక్ష‌లు చెప్ప‌డం ఆక‌ట్టుకుంటోంది. ఎందుకంటే ఉప్పునిప్పులా ఉండే బాబు, జ‌గ‌న్ మ‌ధ్య ఇలాంటి ఆహ్లాద‌క‌ర‌ సందేశాలు అరుద‌నే చెప్పాలి. దీంతో బాబు బ‌ర్త్‌డే ట్వీట్ స‌హ‌జంగానే అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

ప్ర‌భుత్వాధినేత జ‌గ‌న్ పుట్టిన రోజును పుర‌స్క‌రించుకుని ట్విటర్‌లో చంద్ర‌బాబు స్పందిస్తూ .. ‘వైఎస్‌ జగన్‌ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్‌ చేశారు. గ‌తంలో కూడా చంద్ర‌బాబు, జ‌గ‌న్ ప‌ర‌స్ప‌రం పుట్టిన రోజుల నాడు ట్విట‌ర్ వేదిక‌గా విషెస్ చెప్పుకున్నారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కూడా జ‌గ‌న్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా, నిరంతరం ప్రజా సేవలో జీవించాలని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. 

వ్య‌క్తిగ‌తంగా కేటీఆర్ ఫ్యామిలీతో జ‌గ‌న్‌కు మంచి సంబంధాలున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల సాగునీటి విష‌య‌మై ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం త‌లెత్తిన‌ప్ప‌టికీ, వ్య‌క్తిగతంగా మాత్రం ప‌ర‌స్ప‌రం ఏనాడూ విమ‌ర్శించుకున్న దాఖ‌లాలు లేవు. 

అచెన్న రిపేర్లు చెయ్యగలడా?