గత వారం రోజులుగా దర్శకుడు శివనిర్వాణ-హీరో విజయ్ ల పాన్ ఇండియా సినిమా అంటూ తెగ గ్యాసిప్ లు. పైగా హీరోయిన్ కియారా అద్వానీ అంటూ ముక్తాయింపులు. కానీ అసలు విషయం వేరుగా వుంది.
ఇప్పటి వరకు శివనిర్వాణకు హీరో విజయ్ దేవరకొండ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కియారా అద్వానీని ఒప్పించాలని ప్రయత్నించిన మాట వాస్తవం. రెండు మూడు నెలులు తిరిగాడు కానీ ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు.
సాయి పల్లవి దగ్గరకు వెళ్లారని బోగట్టా. ఆమె కూడా అమీ తుమీ తేల్చలేదు. కానీ అదిగో కియారా ఇదిగో సినిమా అంటూ గ్యాసిప్ లు. ఇలాంటి నేపథ్యంలో హీరో అటు పూరీ సినిమాలు రెండు చేస్తున్నారు. అవి పూర్తి కావాలి.
ఆ తరువాత సంగతి ఇది. ఈ లోగా వేరే హీరో దగ్గరికి వెళ్లడానికి లేదు. వేరే హీరో దగ్గరకు వెళ్లాలి అంటే వేరే కథ పట్టుకుని వెళ్లాలి. ఈ లవ్ స్టోరీతో వెళ్లడానికి లేదు. పోనీ అలా అని వేరే కథతో వెళ్లాలన్నా ముందుగా ఈ హీరో నుంచి గ్రీన్ సిగ్నల్ రావాలి. అంత వరకు కుదరదు.
మొత్తం మీద శివనిర్వాణ జంక్షన్ లో నిలబడిపోయారు. ఇప్పటికే టక్ జగదీష్ వచ్చి చాలా కాలం అయిపోయంది. దాని తరువాత నాని సినిమా ఒకటి విడుదలయింది. మరోటి విడుదలకు సిద్దంగా వుంది. కానీ శివనిర్వాణ సినిమా కనీసం మరో ఏడాదికి కానీ వచ్చే సూచనలు కనిపించడం లేదు.