అప్పుడు చైనా.. ఇప్పుడు బ్రిటన్

కరోనా వైరస్ ని ప్రపంచానికి అంటించిందనే చెడ్డపేరు చైనాకు వచ్చింది. ఇప్పుడు స్ట్రెయిన్ అనే కొత్త వైరస్ ని ప్రపంచానికి పరిచయం చేస్తోందన్న చెడ్డ పేరుతో బ్రిటన్ సతమతమవుతోంది. బ్రిటన్ తో పాటు దక్షిణాఫ్రికా…

కరోనా వైరస్ ని ప్రపంచానికి అంటించిందనే చెడ్డపేరు చైనాకు వచ్చింది. ఇప్పుడు స్ట్రెయిన్ అనే కొత్త వైరస్ ని ప్రపంచానికి పరిచయం చేస్తోందన్న చెడ్డ పేరుతో బ్రిటన్ సతమతమవుతోంది. బ్రిటన్ తో పాటు దక్షిణాఫ్రికా కూడా ప్రపంచ దేశాలకు కార్నర్ అయింది.

ఈ రెండు దేశాల నుంచి వచ్చే విమానాలపై బెల్జియం, నెదర్లాండ్ దేశాలు నిషేధం విధించాయి. రేపో మాపో జర్మనీ కూడా నిషేధం విధించే దిశగా నిర్ణయం తీసుకుంది. ఆ రెండు దేశాలకు ఇతర ప్రపంచ దేశాల నుంచి విమాన రాకపోకలు తగ్గిపోయాయి. కేవలం రెండే రెండు రోజుల్లో ఈ పరిణామాలన్నీ జరిగాయి. దీనికి కారణం స్ట్రెయిన్ వైరస్.

ఇన్ ఫ్లూయెంజా రకానికి చెందిన ఈ స్ట్రెయిన్ మూలాలు బ్రిటన్ లో బైటపడ్డాయి. మన శరీరంపై రెండు లేదా అంతకంటే ఎక్కువ వైరస్ లు అటాక్ చేసినప్పుడు మ్యుటేటెడ్ వైరస్ గా స్ట్రెయిన్ బైటపడుతుంది. బ్రిటన్ లో కరోనా లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్న 60శాతం మందికి స్ట్రెయిన్ ఉన్నట్టు నిర్థారణ అయిందట. కరోనా కంటే 70శాతం ఎక్కువగా స్ట్రెయిన్ వ్యాపిస్తోందట. ఈ వార్తలు వింటుంటేనే గుండె ఝల్లుమంటోంది.

ఇక స్ట్రెయిన్ విస్తరణ పూర్తి స్థాయిలో నిర్థారణ అయితే ప్రపంచం మరోసారి స్తంభించి పోవడం ఖాయం. ఇప్పటివరకూ బ్రిటన్, దక్షిణాఫ్రికాల్లో మాత్రమే స్ట్రెయిన్ వైరస్ ని గుర్తించారు. 

మరికొన్ని దేశాల్లో కూడా దీని జాడ కనిపించినా.. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందనే కారణంతో ఎవరూ బైటపెట్టలేదనే అనుమానాలు కూడా వ్యాపిస్తున్నాయి. ఈ దశలో మిగతా ప్రపంచ దేశాల పరిస్థితి ఏంటనేది డైలమాలో పడింది. బెల్జియం, నెదర్లాండ్, జర్మనీలాగే.. బ్రిటన్ తో సంబంధాలు తెంచుకోవాలా, లేక వేచి చూడాలా అనేది సస్పెన్స్ గా మారింది.

టీకా సంగతేంటి..?

కొవిడ్ టీకాతో స్ట్రెయిన్ ని కూడా నివారించొచ్చు అని చెప్పలేమంటున్నారు బ్రిటన్ వైద్యులు. వీరి మాటే నిజమైతే.. ఇప్పుడు కొవిడ్ టీకా తీసుకోవడం వల్ల ఉపయోంగ ఏంటి? బ్రిటన్, అమెరికా సహా ఇతర దేశాల్లో కొవిడ్ టీకా పంపిణీ జోరుగా సాగుతోంది. భారత్ లాంటి దేశాల్లో రేపో మాపో అంటున్నారు.

మరి వీటి భవిష్యత్ ఏంటి? స్ట్రెయిన్ టీకా కనిపెట్టే వరకు వేచి చూడాలా.. లేక కొవిడ్ తో సరిపెట్టుకోవాలా.? ఇంతా కష్టపడి కొవిడ్ టీకా వేసిన రెండోరోజే స్ట్రెయిన్ తో ఆస్పత్రి పాలయితే పరిస్థితి ఏంటి? టీకా పంపిణీకే సగం సిబ్బంది సరిపోతే.. స్ట్రెయిన్ వచ్చినవారిని ఎవరు కాపాడాలి, వారిని ఎక్కడ ఉంచాలి? ఇలాంటి సవాలక్ష ప్రశ్నలు ప్రస్తుతానికి ఊహలకే పరిమితం అయినా, అవి నిజమయ్యే రోజులు కూడా ఎంతో దూరంలో లేవనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.

యూకే, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్ దేశాల్లో ఇప్పటికే లాక్ డౌన్ పూర్తిస్థాయిలో మొదలైంది. క్రిస్మస్ వేడుకల్ని కూడా రద్దు చేసుకుంటున్నారంటే పరిస్థితి తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు.

ప్రస్తుతానికి వార్తల్లో వైరస్ గా ఉన్న స్ట్రెయిన్ ఉనికి మరింత ప్రమాదకరంగా ఉండకూడదని కోరుకోవడం ఒక్కటే మనం చేయగల పని. మాస్క్ లేని మహరాజుల్లా తిరుగుతున్న భారత ప్రజలు మరోసారి శానిటైజర్లు, మాస్క్ లు బయటకు తీయాల్సిందే. భౌతిక దూరం వంటి నిబంధనలు మరింత కఠినంగా పాటించాల్సిందే. 

అచెన్న రిపేర్లు చెయ్యగలడా?