భీమ్లా రికార్డ్.. ఓవర్సీస్ లో అదరగొట్టిన పవన్

ఓవర్సీస్ లో భీమ్లానాయక్ రికార్డ్ సృష్టించాడు. ప్రీమియర్స్ టాప్-10 లిస్ట్ లోకి నేరుగా చేరుకుంది ఈ సినిమా. ఈమధ్య రిలీజైన పుష్ప సినిమా కూడా ఈ ఘనత సాధించలేకపోయింది. భీమ్లానాయక్ సినిమాకు కేవలం ప్రీమియర్స్…

ఓవర్సీస్ లో భీమ్లానాయక్ రికార్డ్ సృష్టించాడు. ప్రీమియర్స్ టాప్-10 లిస్ట్ లోకి నేరుగా చేరుకుంది ఈ సినిమా. ఈమధ్య రిలీజైన పుష్ప సినిమా కూడా ఈ ఘనత సాధించలేకపోయింది. భీమ్లానాయక్ సినిమాకు కేవలం ప్రీమియర్స్ తోనే 8 లక్షల 58వేల డాలర్ల వసూళ్లు వచ్చాయి.

టాప్-10 యూఎస్ఏ ప్రీమియర్స్ లిస్ట్ లో భీమ్లానాయక్ నేరుగా 7వ స్థానానికి చేరుకుంది. ఈ క్రమంలో సైరా, భరత్ అనే నేను, అల వైకుంఠపురములో సినిమాల్ని వెనక్కి నెట్టింది ఈ మూవీ. ఓవైపు థియేటర్లకు ఆడియన్స్ ను రప్పించడానికి ఇతర సినిమాలు నానా తంటాలు పడుతుంటే, భీమ్లానాయక్ ఇలా మొదటి రోజు నుంచే రికార్డులు షురూ చేశాడు.

మలయాళంలో హిట్టయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది భీమ్లానాయక్. మరోవైపు ఈ సినిమా రిలీజ్ పలుమార్లు వాయిదా పడింది. ఇంకోవైపు ట్రయిలర్ పై విమర్శలు చెలరేగాయి. అయినప్పటికీ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమాపై ఆడియన్స్ కు ఆసక్తి తగ్గలేదనడానికి యూఎస్ఏ ప్రీమియర్స్ వసూళ్లే నిదర్శనం.

టాప్-10 యూఎస్ఏ ప్రీమియర్స్

బాహుబలి 2 – $4,517,704

అజ్ఞాతవాసి – $1,521,438

బాహుబలి – $1,364,416

ఖైదీ నంబర్ 150 – $1,295,613

స్పైడర్ – $1,005,630

సాహో – $9,15,224

భీమ్లానాయక్ – $858000

సైరా – $8,57,765

భరత్ అనే నేను – 850k (మొదటి రోజు – 1.4 Million)

అల వైకుంఠపురములో – $8,09,072