బాలయ్య-రావిపూడి-దిల్ రాజు?

సీనియర్ హీరో బాలయ్యతో సినిమా చేయాలనే కోరికను ఇంకా చంపుకున్నట్లు లేదు దిల్ రాజు. బోయపాటి కాంబినేషన్ లో చేయాలి అనుకున్నారు కానీ కథ, బడ్జెట్ సెట్ కాలేదు. ఇప్పడు మరో ప్రయత్నం చేయబోతున్నట్లు…

సీనియర్ హీరో బాలయ్యతో సినిమా చేయాలనే కోరికను ఇంకా చంపుకున్నట్లు లేదు దిల్ రాజు. బోయపాటి కాంబినేషన్ లో చేయాలి అనుకున్నారు కానీ కథ, బడ్జెట్ సెట్ కాలేదు. ఇప్పడు మరో ప్రయత్నం చేయబోతున్నట్లు గ్యాసిప్ వినిపిస్తోంది.

ప్రస్తుతం దిల్ రాజు క్యాంప్ లో వుండి ఎఫ్ 3 సినిమా చేస్తున్న అనిల్ రావిపూడి డైరక్షన్ లో ఓ సినిమా బాలయ్య హీరోగా చేస్తే ఎలా వుంటుంది అన్న ఆలోచనలు సాగుతున్నట్లు తెలుస్తోంది. 

ఎఫ్ 3 తరువాత మహేష్ తో సినిమాచేయాలి. కానీ మహేష్ సర్కారువారిపాట సినిమా నుంచి రావడానికి, ఎఫ్ 3 ని అనిల్ రావిపూడి ఫినిష్ చేయడానికి మధ్య కాస్త ఎక్కువ టైమ్ వుంటుందని లెక్కలు కడుతున్నట్లు బోగట్టా.

ఈ గ్యాప్ ను వాడుకుని బాలయ్యతో సినిమా చేయడానికి వీలు అవుతుందా అనే ఆలోచనలు, ప్లాన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య తో సినిమాలు చేసే ఆలోచనలో మైత్రీ మూవీస్, ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ వున్నాయి. 

ఆ క్యూ లైన్ లో దిల్ రాజు బ్యానర్ కూడా చేరుతున్నట్లు కనిపిస్తోంది. కానీ అసలు ఈ క్యూ కదలాలి అంటే బోయపాటి సినిమా ఫినిష్ కావాలి.

అచెన్న రిపేర్లు చెయ్యగలడా?