తమిళ డైరక్టర్ తో రామ్ జత?

ఇస్మార్ట్ శంకర్ తరువాత రెడ్ సినిమా చకచకా చేసేసాడు హీరో రామ్. కానీ ఆ తరువాత సినిమాకే లెగ్ బ్రేక్ పడిపోయింది. సరైన కథ, డైరక్టర్ సెట్ కావడం లేదు. డైరక్టర్ మారుతి రెండు…

ఇస్మార్ట్ శంకర్ తరువాత రెడ్ సినిమా చకచకా చేసేసాడు హీరో రామ్. కానీ ఆ తరువాత సినిమాకే లెగ్ బ్రేక్ పడిపోయింది. సరైన కథ, డైరక్టర్ సెట్ కావడం లేదు. డైరక్టర్ మారుతి రెండు కథలు చెప్పారు కానీ రెండూ రామ్ కు నచ్చలేదు. 

త్రివిక్రమ్ డైరక్షన్ లో చేయాలనివుంది కానీ అది వీలు కావడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ఎప్పుడో ఒకసారి వద్దు అన్న ప్రాజెక్టునే బయటకు తీస్తున్నట్లు బోగట్టా. 

అనిల్ సుంకర ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ లో తమిళ డైరక్టర్ నీల్సన్ తో ఓ సినిమా చేయాలన్న ప్రతిపాదన చాలా కాలం కిందట వచ్చింది.కానీ అప్పట్లో రామ్ పెద్ద సుముఖత వ్యక్తం చేయలేదు.

ఇప్పుడు మళ్లీ ఆ ప్రాజెక్టు వైపే మొగ్గుతున్నట్లు తెలుస్తోంది. అయితే అతగాడు తమిళంలో ఓ సినిమా చేయాల్సి వుంది. మరి ఇప్పుడు ఇటు వస్తాడో? రాడో? లేదా ఎకె లోనే మరో డైరక్టర్ తో రామ్ సినిమా చేస్తాడో? చూడాలి. 

కృష్ణ..కృష్ణ..అమరావతిపై సరైన ప్రశ్న