ప్రభాస్ మరో పాన్ ఇండియా సినిమా

బాహుబలి ప్రభాస్ చేతిలో మూడు ప్రాజెక్టులు వున్నాయి. మూడూ కూడా పాన్ ఇండియా సినిమాలే. ముఖ్యంగా ఆదిపురుష్, సలార్ సినిమాలు రెండూ క్రేజీ ప్రాజెక్టులే. ఇవి కాక రాధేశ్యామ్ వుండనే వుంది. ఇవన్నీ ఇలా…

బాహుబలి ప్రభాస్ చేతిలో మూడు ప్రాజెక్టులు వున్నాయి. మూడూ కూడా పాన్ ఇండియా సినిమాలే. ముఖ్యంగా ఆదిపురుష్, సలార్ సినిమాలు రెండూ క్రేజీ ప్రాజెక్టులే. ఇవి కాక రాధేశ్యామ్ వుండనే వుంది. ఇవన్నీ ఇలా వుండగానే మరో మాంచి ప్రాజెక్ట్ చేయబోతున్నాడట.

అయితే ఈ ప్రాజెక్ట్ కు డైరక్టర్ కావాలి. వీలయినంత వరకు బాలీవుడ్ డైరక్టర్ కావాలని ప్రభాస్ చూస్తున్నట్లు బోగట్టా. మైత్రీ మూవీస్ కు ప్రభాస్ ఎప్పుడో సినిమా చేయాలి. కానీ కథ, డైరక్టర్ సెట్ కావడం లేదు. ఈ లోగా రెండు సినిమాలు మధ్యలో చేరిపోయాయి.

అయితే వీటి తరువాత సినిమా కచ్చితంగా మీకే చేస్తానని ప్రభాస్ మైత్రీ మూవీస్ నిర్మాతలకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. మాంచి బాలీవుడ్ డైరక్టర్ ను ఎవరినైనా చూడమని చెప్పినట్లు తెలుస్తోంది. మీరూ ట్రయ్ చేయండి. నేనూ ట్రయ్ చేస్తా అని ప్రభాస్ చెప్పినట్లు బోగట్టా. 

అయితే మైత్రీ మూవీస్ జనాలు తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ పేరు ను ప్రభాస్ కు సజెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఆ పేరుతో పాటు, బాలీవుడ్ డైరక్టర్ల ను ఎవరినైనా చూడమని ప్రభాస్ కోరినట్లు తెలుస్తోంది. డైరక్టర్ దొరికితే ప్రభాస్ నుంచి మరో పాన్ ఇండియా అనౌన్స్ మెంట్ వస్తుందన్నమాట. 

కృష్ణ..కృష్ణ..అమరావతిపై సరైన ప్రశ్న