ఇక ‘పనిమనిషి లక్ష్మమ్మ’ లీకులే మిగిలాయి!

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని నిందితుడిగా ప్రచారం చేసే ప్రయత్నం చాలా ముమ్మరంగానే జరుగుతోంది. నిజంగా హత్య వెనుక ఆయన ఉంటే కోర్టు ఎటూ శిక్షిస్తుంది. ఎవ్వరూ కాపాడలేరు.…

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని నిందితుడిగా ప్రచారం చేసే ప్రయత్నం చాలా ముమ్మరంగానే జరుగుతోంది. నిజంగా హత్య వెనుక ఆయన ఉంటే కోర్టు ఎటూ శిక్షిస్తుంది. ఎవ్వరూ కాపాడలేరు. అయితే.. ఆ ఘట్టం రాక ముందే.. ఆయనను పడగల శిక్షకు మించి బద్నాం చేయాలనే ప్రయత్నం పచ్చమీడియాలో చాలా కనిపిస్తోంది. 

సీబీఐకు ఇచ్చిన వాంగ్మూలాల లీకుల పేరిట.. ప్రతిరోజూ కొన్ని వివరాలు ప్రచురిస్తున్నారు. ఇప్పటికే దస్తగిరి, ఇనాయతుల్లా, రంగన్న ఇలా అనేకమంది పేర్లతో, వారు సీబీఐకు చెప్పిన వివరాలు ఇవీ అంటూ చాలా కథనాలు  పచ్చమీడియా పత్రికల్లో వెల్లువగా వచ్చాయి. ఇక పనిమనిషి లక్ష్మమ్మ చెప్పిన వాంగ్మూలం అంటూ కొత్త లీకులను ఇవ్వడమే మిగిలింది.

లక్ష్మమ్మ అంటే వైఎస్ వివేకానందరెడ్డి ఇంటి పనిమనిషి. వివేకానందరెడ్డి హత్యకు గురైన తర్వాత.. తొలిసారిగా చూసిన వారిలో ఆమె కూడా ఉన్నారు. ఇతరత్రా వచ్చిన లీకులను బట్టి.. బెడ్ రూంలో హాలులో ఆరోజున రక్తపు మరకలను శుభ్రం చేసింది కూడా లక్ష్మమ్మే. తొలిసారిగా చూసినది గనుక.. ఆమె చెప్పగల మాటలు కూడా సహజంగానే కీలకం అవుతాయి. 
వాచ్ మెన్ రంగయ్య లీకులుగా పత్రికల్లో వచ్చిన కథనాలను బట్టి ఆమెతోనే రక్తపు మరకలు అన్నీ శుభ్రం చేయించారు. 

ఇప్పుడు ఆమెతోనే ఎవరి మీద మరకలు పడేలా చేయాలో నిర్ణయించే ఎపిసోడ్ నడుస్తుండవచ్చు. ‘వాంగ్మూలంలో వివరాలు బయటకు వచ్చాయి’ అని ఒక చిన్న వాక్యాన్ని జోడించి ఈ పచ్చ పత్రికలు తమకు తోచినదెల్లా రాస్తున్నాయా? లేదా, దర్యాప్తు సంస్థ వీరికి మాత్రం రహస్యంగా ఉంచవలసిన డాక్యుమెంట్లను అందిస్తున్నదా? అనేది పెద్ద ప్రశ్న. 

ఎవరు ఎన్ని లీకులైనా ఇవ్వవచ్చు.. ఎన్ని వాంగ్మూలాలు అయినా నమోదు కావొచ్చు కానీ.. పచ్చ మీడియా లక్ష్యం మాత్రం ఒక్కటే కనిపిస్తోంది. ఎంపీ అవినాష్ రెడ్డిని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఇరికించడం. వాంగ్మూలాల లీకుల రూపంలో వారు వెల్లడి చేస్తున్న వివరాలన్నీ కూడా అవినాష్ చుట్టూ తిరిగి ఆగిపోతున్నాయి. 

నిజానిజాలు ఎలాగైనా ఉండవచ్చు. కానీ ఇదంతా కూడా ఒక కుట్రపూరిత ప్రచారంలాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ క్రమంలో భాగంగానే.. పనిమనిషి లక్ష్మమ్మ వాంగ్మూలం లీకుల పేరుతో.. ఇంకాస్త ప్రచారం కూడా పచ్చమీడియాలో ఇవాళో రేపో వచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ విషప్రచారం ఎప్పటికి ఆగుతుందో ఏమో?

2 Replies to “ఇక ‘పనిమనిషి లక్ష్మమ్మ’ లీకులే మిగిలాయి!”

Comments are closed.