బిగ్ బాస్ విన్నర్ ఎవరు.. మరికాసేపట్లో తేలిపోతుంది

కొన్ని వారాలుగా పడుతూలేస్తూ సాగుతున్న బిగ్ బాస్ సీజన్-4 క్లైమాక్స్ కు చేరుకుంది. ప్రస్తుతం హౌజ్ లో ఐదుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. వీళ్లలో విన్నర్ ఎవరో ఈరోజు తేలిపోతుంది. అవును.. బిగ్ బాస్…

కొన్ని వారాలుగా పడుతూలేస్తూ సాగుతున్న బిగ్ బాస్ సీజన్-4 క్లైమాక్స్ కు చేరుకుంది. ప్రస్తుతం హౌజ్ లో ఐదుగురు కంటెస్టెంట్లు మాత్రమే మిగిలారు. వీళ్లలో విన్నర్ ఎవరో ఈరోజు తేలిపోతుంది. అవును.. బిగ్ బాస్ సీజన్-4 గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన కీలకమైన షూటింగ్ ఈరోజు జరుగుతుంది. సో.. ఆటోమేటిగ్గా విన్నర్ ఎవరనే విషయం మరికాసేపట్లో బయటకు వచ్చేస్తుంది.

ఇంతకుముందు జరిగిన 3 సీజన్లలో ఇలానే జరిగింది. విన్నర్ ఎవరనే విషయం గ్రాంఢ్ ఫినాలే షూట్ జరిగిన రోజు రాత్రే తెలిసిపోయింది. అదే రోజు రాత్రి అన్నపూర్ణ స్టుడియోస్ బయట అభిమానులు సంబరాలు చేసిన ఘటనలు కూడా మనం చూశాం.

అయితే ఈసారి ఉత్కంఠను ఇంకాస్త పెంచారు. అది ఎలా అంటే.. గ్రాండ్ ఫినాలేకు చెందిన ఎలిమినేషన్ రౌండ్స్ షూటింగ్ ను నిన్ననే పూర్తిచేశారు. కొన్ని పెర్ఫార్మెన్సులు కూడా నిన్ననే పూర్తయ్యాయి. అయితే విజేత ఎవరనే కీలకమైన అంశానికి సంబంధించిన షూటింగ్ ను మాత్రం ఈరోజే షూట్ చేసి టెలికాస్ట్ చేస్తారు. మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా వచ్చి విజేత పేరును, రాత్రి వరకు వచ్చిన ఓట్లను ప్రకటిస్తారు.

ఫినాలేలో భాగంగా ఎలిమినేట్ అయిన కంటెస్టంట్లు అందర్నీ మరోసారి వేదిక పైకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే గంగవ్వ, కుమార్ సాయి లాంటి వాళ్లు కనిపించారు. మిగతా వాళ్లంతా ఈరోజు కనిపించబోతున్నారు.

ఇక అసలు పోటీ విషయానికొస్తే.. చివరిగా మిగిలిన ఐదుగురు కంటెస్టెంట్లలో ఎవరు విన్నర్ ఎవరు రన్నర్ అనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఇప్పటికే భారీ ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ప్రధానంగా పోటీ మాత్రం ఇద్దరి మధ్య మాత్రమే ఉందనేది ఓపెన్ సీక్రెట్. అభిజీత్ గెలుస్తాడా.. అఖిల్ గెలుస్తాడా అనేది మరికొద్దిసేపట్లో తెలిసిపోతుంది.

నిజానికి ఎక్కువమంది అభిజీత్ గెలుస్తాడని ఫిక్స్ అయిపోయారు. హౌజ్ నుంచి బయటకొచ్చిన కంటెస్టెంట్లు కూడా ఇదే విషయం చెప్పారు. విజేత ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.

కృష్ణ..కృష్ణ..అమరావతిపై సరైన ప్రశ్న