అబ్బబ్బో త్రివిక్రమ్ సైడ్ ఇన్‌కమ్!

ఎన్టీఆర్‌తో తదుపరి చిత్రం చేయడానికి కమిట్ అయిన త్రివిక్రమ్ ఆ సినిమా ఎప్పుడు మొదలు పెట్టేదీ ఇంకా తెలీదు. రాజమౌళి సినిమా పూర్తి చేసుకుని ఎన్టీఆర్ వచ్చినట్టయితే త్రివిక్రమ్ సినిమా మొదలవుతుంది.  Advertisement ఎప్పుడు…

ఎన్టీఆర్‌తో తదుపరి చిత్రం చేయడానికి కమిట్ అయిన త్రివిక్రమ్ ఆ సినిమా ఎప్పుడు మొదలు పెట్టేదీ ఇంకా తెలీదు. రాజమౌళి సినిమా పూర్తి చేసుకుని ఎన్టీఆర్ వచ్చినట్టయితే త్రివిక్రమ్ సినిమా మొదలవుతుంది. 

ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది తెలియదు కానీ ఏప్రిల్‌లోగా మొదలయినట్టయితే 2022 సంక్రాంతికి, ఇంకా లేటయితే ఆ సమ్మర్‌కి విడుదల చేసేలా ప్లాన్ జరుగుతోంది.

ఎన్టీఆర్ వచ్చేలోగా మరో సినిమా డైరెక్ట్ చేయాలని త్రివిక్రమ్ ప్రయత్నాలు చేసాడు కానీ వేరే సినిమా ఏదీ కమిట్ అవలేదు. అయితే ఈ ఖాళీ టైమ్‌ని త్రివిక్రమ్ అద్భుతంగా క్యాష్ చేసుకుంటున్నాడు. 

మాటల రచయితగా తనకున్న డిమాండ్‌తో అటు అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్‌కి మాటలు రాస్తూ భారీ పారితోషికం తీసుకున్నాడు. 

అలాగే రానా దగ్గుబాటి కోసం గుణశేఖర్ సిద్ధం చేస్తోన్న హిరణ్యకశ్యప చిత్రానికి కూడా త్రివిక్రమ్ రచన చేస్తున్నాడు. దీనికోసం త్రివిక్రమ్‌కు అయిదు కోట్లు పైగానే పారితోషికమని చెప్పుకుంటున్నారు. 

అలాగే రామాయణం చిత్రానికి కూడా త్రివిక్రమ్ తన మాటల మాయాజాలం చూపిస్తున్నాడు. దర్శకుడిగా ఒక సినిమా కోసం ఏడాదికి పైగా శ్రమించే దానికంటే కేవలం కొద్ది నెలల వ్యవధిలో త్రివిక్రమ్ రచయితగా కోట్లు సంపాదిస్తున్నాడు. 

కృష్ణ..కృష్ణ..అమరావతిపై సరైన ప్రశ్న