పవన్ నుంచి మరో కొత్త సినిమా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ జోరు మీద వున్నారు. ఎన్నికల తరువాత మూడున్నరేళ్లలో రెండే రెండు సినిమాలు చేసిన పవన్, చివరి ఏణ్ణర్ధంలో నాలుగైదు సినిమాలు అందించాలనే ప్రయత్నంలో వున్నారు.  Advertisement సినిమాకు 70…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ జోరు మీద వున్నారు. ఎన్నికల తరువాత మూడున్నరేళ్లలో రెండే రెండు సినిమాలు చేసిన పవన్, చివరి ఏణ్ణర్ధంలో నాలుగైదు సినిమాలు అందించాలనే ప్రయత్నంలో వున్నారు. 

సినిమాకు 70 నుంచి 80 కోట్ల వంతున సమీకరించి ఎన్నికలకు సమాయత్తం అవుదాం అనుకుంటున్నారో లేదా పిల్లలకు భవిష్యత్ భరోసా కల్పించారనుకుంటున్నారో మొత్తం మీద సినిమాలు అయితే చకచకా చేస్తున్నారు. ఇక్కడ కూడా ఓ సూక్ష్మం కనిపెట్టారు.

రోప్ లు కట్టుకుని భారీ ఫైట్లు చేయకుండా, సింపుల్ డ్యాన్స్ లు వుంటూ, జస్ట్ ముఫై, నలభై రోజుల్లో సినిమా పూర్తయిపోయే విధమైన పాత్రల కోసం పవన్ చూస్తున్నారు. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, ఓజి సినిమాలు అన్నీ ఇలాంటివే. పట్టుమని నలభై కాల్ షీట్లకు మించి ఇవ్వనివే. మంచి రెమ్యూనిరేషన్లు ఇచ్చినవే.

రోప్స్ కట్టుకుని ఫైట్లు చేయాల్సిన హరి హర వీరమల్లు సినిమాల్లో వాటిని తీసేయించారని టాక్. కథ ను మార్చారు. అన్నీ చేసి కూడా సినిమాను మాత్రం పూర్తి చేయడం లేదు. నిజానికి హరి హర వీరమల్లు పూర్తి చేయాలనే సంకల్పం వుంటే బ్రో లేదా ఓజి డేట్ లు దానికి ఇవ్వవచ్చు. కానీ అలా జరగలేదు. 

ఈ రెండు సినిమాల వల్ల దగ్గర దగ్గర 140 నుంచి 150 కోట్ల రెమ్యూనిరేషన్ పవన్ అందుకున్నారని టాలీవుడ్ టాక్. అదే కనుక హరిహర మీద కూర్చుంటే ఏం వస్తుంది?

జూన్ తో బ్రో, ఓజి సినిమాలకు పవన్ పార్ట్ అయిపోతుంది. ప్రమోషన్లకు పవన్ ఎలాగూ రారు. అందువల్ల జూలై నుంచి డిసెంబర్ వరకు మూడు నెలల్లో తలుచుకుంటే కనీసం మరో సినిమా లాగించేయవచ్చు. అందుకే త్రివిక్రమ్ ఆ దిశగా కథల కోసం వెదుకుతున్నట్లు తెలుస్తోంది. 

పవన్ ను పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ముఫై-నలభై రోజుల్లో పూర్తయ్యే కథ లేదా రీమేక్ దొరికితే మరో నిర్మాత-దర్శకుడి చేతిలో పెడతారు. రామ్ తాళ్లూరికి ఓ సినిమా బకాయి వుండనే వుంది. హరి హర, ఉస్తాద్ కొంత చేసి, మరో కొత్త సినిమా చేయాలనే ప్రయత్నాలు పవన్ క్యాంప్ లో జరుగుతున్నాయని తెలుస్తోంది.