సినిమా బాలేదన్న ఎడిటర్!

ఓ యంగ్ అప్ కమింగ్ హీరో నటిస్తున్న సినిమా అది. వీర..ఊర మాస్ సినిమా. ఈ సినిమా దాదాపు పూర్తయింది. మరో వారం పది రోజులు షూట్ చేస్తే పనైపోతుంది.  Advertisement కానీ ఈ…

ఓ యంగ్ అప్ కమింగ్ హీరో నటిస్తున్న సినిమా అది. వీర..ఊర మాస్ సినిమా. ఈ సినిమా దాదాపు పూర్తయింది. మరో వారం పది రోజులు షూట్ చేస్తే పనైపోతుంది. 

కానీ ఈ దశలో మొత్తం ఫుటేజ్ చూసిన ఎడిటర్, అసలు ఇదేం టేకింగ్, ఇదేం వర్క్, బాగా లేదని నిర్మాతకు కాన్ఫిడెన్షియల్ గా రిపోర్డ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో సినిమా కీలక బాధ్యులు సినిమా చూసారు. విషయం అర్ణం చేసుకున్నారు. కానీ ఈ దశలో చేసేదేమీ లేదు. ఎడిటింగ్ టేబుల్ మీద ఎంత వరకు రిపేర్ చేయగలిగితే అంతా చేయడం తప్ప.

పైగా అదృష్టం ఒకటి వుంది. ఈ సినిమా ప్రొడక్షన్ మొత్తం నాన్ థియేటర్ ఆదాయంతో జరిగిపోయింది. అందువల్ల థియేటర్ మీద భారం లేదు. థియేటర్ మార్కెట్ బాగానే చేసుకోవచ్చు. తేడా వస్తే, లైన్ లో వున్న సినిమాలతో కవర్ చేసుకోవచ్చు. అందుకే సైలంట్ గా సినిమా పూర్తి చేసి వదలడానికే సిద్దపడ్డారు.

అయితే ఇవ్వాళ రేపు, సినిమా జనాలు సూపర్ గా వచ్చింది అనుకుంటే ప్రేక్షకులు పక్కన పెడుతున్నారు. సినిమా జనాలు బాగాలేదు, ఏదో మెల్లిగా వదిలేద్దాం అనుకుంటే బ్లాక్ బస్టర్ చేస్తున్నారు. 

గత ఏడాది ఓ సినిమా, ఈ ఏడాది మరో సినిమా అలా బ్లాక్ బస్టర్ కొట్టినవి వున్నాయి. అందుకే ఎంత వరకు చేయాలో అంత వరకు చేసి సినిమాను జనంలోకి వదిలేపనిలో పడ్డారు నిర్మాత.