ఏ సినిమాలకు ఇబ్బంది లేకుండా..

తెలంగాణ ఎన్నికల తేదీలు వచ్చేసాయి. డిసెంబర్ ఫస్ట్ వీక్ నా..సెకెండ్ వీక్ నా అన్న అనుమానాలు. మరీ వెనక్కు వెళ్తే సంక్రాంతి సినిమాలు ఏమవుతాయన్న భయం. ఇవన్నీ తీరిపోయాయిు.  Advertisement నవంబర్ తొలివారం నుంచి…

తెలంగాణ ఎన్నికల తేదీలు వచ్చేసాయి. డిసెంబర్ ఫస్ట్ వీక్ నా..సెకెండ్ వీక్ నా అన్న అనుమానాలు. మరీ వెనక్కు వెళ్తే సంక్రాంతి సినిమాలు ఏమవుతాయన్న భయం. ఇవన్నీ తీరిపోయాయిు. 

నవంబర్ తొలివారం నుంచి అదే నెల 30 వరకే ఎన్నికల హడావుడి. డిసెంబర్ 5 తో అన్నీ పూర్తి. అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి హ్యాపీగా సినిమాలు వేసేసుకోవచ్చు.

నితిన్ ఎక్స్ ట్రా ఆర్టినరీ మాన్, నాని హాయ్ నాన్న, వెంకీ సైంధవ్ డిసెంబర్ తొలివారం అనుకున్నారు. కానీ సైంధవ్ డేట్ మార్చారు. మరి ఇప్పుడు ఎన్నికల డేట్ లు పెర్ ఫెక్ట్ గా వచ్చాక ఏం చేస్తారో చూడాలి. నిజానికి డిసెంబర్ తొలివారం లో రావడానికి ఇప్పుడు ఏ అడ్డంకి లేదు.

నవంబర్ నెలలో అస్సలు సినిమాలు లేవు ఆ మాటకు వస్తే అక్టోబర్ మూడో వారం నుంచే సినిమాలు లేవు. అందువల్ల డల్ గా వుంటుందనే బాధ లేదు. ఎన్నికల వేడి మామూలుగా వుండదు. నవంబర్ అంతా ఎన్నికల సందడితో గడిచిపోతుంది. డిసెంబర్ కు మళ్లీ సినిమాల సందడి రెడీ.