అమెరికా లోని తెలుగు వారికి వెన్నుదన్ను, ఆపదలో ఆపన్న హస్తమందించే అత్యంత ప్రతిష్టాకరమైన సంస్థ, నార్త్ అమెరికన్ తెలుగు అసోసిషన్ (NATA) ఈ ఏడాది డల్లాస్ నగరంలో జూన్ 30 నుండి జూలై 2వ తేది వరకు చరిత్ర లోనే అతి పెద్ద ఎత్తున నిర్వహించడానికి సమాయత్తమవుతున్నది. డల్లాస్ లోని కే బైలీ హచిన్సన్ సెంటర్ లో అసంఖ్యాకమైన అభిమానుల మధ్య జరిగే ఈ మహోత్సవానికి ఎందరో అతిరధ మహారధులైన తెలుగు సినీ, రాజకీయ, సాంస్కృతిక, పాత్రికేయులు, జానపద కళాకారులు, క్రీడాకారులు, వ్యాపార వేత్తలు, సంగీత ప్రముఖులు తరలి రానున్నారు.
నాటా తెలుగు సాంప్రదాయాలని, కళలని, సంగీతాన్ని అపూర్వమైన స్థాయిలో ప్రదర్శించడానికి సంఘటిత ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా, ప్రముఖ ఫ్యాషన్ డిసైనర్ శ్రవణ్ కుమార్ తో కన్నుల పండుగైన ఫ్యాషన్ షో నిర్వహిస్తున్నారు. ఇంకా ప్రముఖ సినీ నృత్య దర్శకురాలు అనీ మాస్టర్ శిక్షణ పర్యవేక్షణలో స్థానిక పిల్లల జానపద, సినీ నృత్య ప్రదర్శనలు అలరించబోతున్నాయి.
ఈ సంబరాన్ని అంబరానికి చేర్చడానికి, ప్రేక్షకులని అలరించడానికి రామ్ గోపాల్ వర్మ,మెర్లపాక గాంధి, శ్రీనివాస రెడ్డి, ఆలీ, లయ గోర్తి, పూజ ఝవాల్కర్, స్పందన పల్లి, అనసూయ, ఉదయ భాను, రవి, రోషన్, రవళి లాంటి ప్రముఖులతో ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించడం జరుగుతోంది. కన్వెన్షన్ చరిత్ర లో మొట్ట మొదటి సారిగా మూడు రోజులు ముగ్గురు టాలీవుడ్ అగ్ర సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్, థమన్, అనూప్ రూబెన్స్ తమ బృందాలతో చేసే సంగీత విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణ గా నిలువనున్నాయి.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఈ మహోన్నత కార్యక్రమానికి సంగీత అభిమానులు రోజలు, గంటలు లెక్కపెడుతున్నారు అంటే అతిశయోక్తి కాదు. మళ్ళీ ఎన్నాళ్ళకు డల్లాస్ నగరానికి వస్తుందో చెప్పలేని నాటా కన్వెన్షన్ ను కనీ వినీ ఎరుగని రీతిలో నిర్వహించి, డల్లాస్ ప్రజలకు మధురానిభూతిని మిగాల్చాలి అని అహర్నిశలు కార్యకర్తలు విశేష కృషి చేస్తున్నారు.
మహా సభల సాంస్కృతిక కార్యక్రమాల కోసం, సాంస్కృతిక కార్యక్రమాల నాయకుడు డాక్టర్ నాగి రెడ్డి దర్గా రెడ్డి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యవర్గ సభ్యులు ఆర్య బొమ్మినేని, జయ తెలక్, మాధవి లోకిరెడ్డి, నంద కొర్వి , రేఖ కరణం, సుప్రియ టంగుటూరి, బ్రహ్మా బీరివెరా, హరి సూరిశెట్టి, సతీష్ సీరం, మరియు అడ్వైసర్స్ హరి వేల్కూర్, రామిరెడ్డి ఆల్ల, ఉషా రాణి చింత, సుజాత వెంపరాల నిరంతరం శ్రమిస్తున్నారు.
నాట అద్యక్షుడు డాక్టర్ కొర్సపాటి శ్రీధర్ రెడ్డి, భవిష్య అద్యక్షుడు హరి వేల్కూర్, పూర్వాధ్యక్షుడు డాక్టర్ గోసాల రాఘవ రెడ్డి, సెక్రటరీ గండ్ర నారాయణ రెడ్డి మొదలుగా గల ఎగ్జిక్యూటివ్ కమిటీ, మహా సభల కన్వీనర్ – NMS రెడ్డి, సమన్వయకర్త డాక్టర్ బూచిపూడి రామిరెడ్డి, కో -కన్వీనర్ కోడూరు కృష్ణా రెడ్డి,కో-కోర్డినేటర్ గండికోట భాస్కర్ రెడ్డి, డిప్యూటీ కన్వీనర్ క్రిష్టపాటి రమన్ రెడ్డి, డిప్యూటీ కోర్డినేటర్ ఆవుల మల్లిక్, బోర్డు అఫ్ డైరెక్టర్స్ జయచంద్రా రెడ్డి, పాముదుర్తి పవన్, పుట్లూర్ రమణ, అరిమండ రవీంద్ర, బత్తుల విష్ణు, RPVs ఆదిత్య రెడ్డి, కొరివి చెన్నా, వైశ్యరాజు మధుమతి, చొప్ప ప్రసాద్, పోలు రాజేంద్ర, వేముల వీరా రెడ్డి సభలు విజయవంతము కావడానికి కృషిచేస్తున్నారు.
ఆద్యంతం అత్యంత ఆసక్తి కరంగా నిర్వహించబోయే ఈ కార్యక్రమంలో మీరూ పాలుపంచుకోవాలి అనుకుంటున్నారా? ఐతే మిమ్మల్ని, మీకుటుంబ సభ్యులని, మిత్రులని మన నాటా సాదరంగా ఆహ్వానిస్తోంది. సత్వరమే ఈ క్రింది వెబ్ సైట్ ని సందర్శించి మీపేరు నమోదు చేసుకోమనవి. https://nataconventions.org/conference-registration.php