గురువారం సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో రాజకీయ అంశాలకు సంబంధించి పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఆడపిల్లల్ని మోసగించినంత సులువు కాదు అనే హితవు నెటిజన్లు చెప్పడం ఆ పోస్టుల్లోని సారాంశం. ఇంతకూ ఈ పోస్టులు ఎందుకు ఇప్పుడు వైరల్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అసలే ఎన్నికల సీజన్. ఏపీలో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో నాయకులు ఆచితూచి మాట్లాడుతున్నారు. ప్రతి మాటను ప్రత్యర్థులు జాగ్రత్తగా గమనిస్తున్నారు. పొత్తులపై ఒక నాయకుడు చేసిన కామెంట్స్ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇందులో భాగంగానే ఆయన గారికి కౌంటర్‌గా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు ప్రత్యక్షమవుతున్నాయి.
“సీఎం పదవి వరించి తనే రావాలి, కండిషన్లు పెట్టి సాధించుకోలేం” అని అన్న ఆ నాయకుడికి నెటిజన్లు గట్టిగానే బుద్ధి చెబుతున్నారు.
“ఇంత చిన్న వయసులోనే ఎంత వైరాగ్యం స్వామీ. ముఖ్యమంత్రి పదవి తనంతట తానే వచ్చి వరించడం, లేదా కంఢీషన్లతో అడుక్కోవడం…ఈ రెండూ సరికాదు సరే. కానీ ఈ రెండూ కాకుండా మూడో పధ్ధతి కూడా ఉంది కదా. ఎన్నికల్లో పోటీ చేయడం, ప్రజల మనసులను గెలిచి ముఖ్యమంత్రి పదవిని దక్కించుకోవడం. రాజకీయాల్లో అడ్డదారులుండవు. అలాంటి కష్టమైన పధ్ధతులు మనకెందుకులే అని ఎవరన్నా ఒప్పించారా మిమ్మల్ని?” అంటూ సోషల్ మీడియాలో దెప్పి పొడిచారు.
“మరికొందరు నెటిజన్లు కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు. “అమాయకులైన ఆడపిల్లలు అనుకున్నావా నాలుగైదేళ్లకు ఒకరు చొప్పున వరించి రావడానికి! అది ముఖ్యమంత్రి పదవి! చంద్రబాబులా కుట్రలు చేస్తే వస్తుంది ! జగన్ లా ప్రజల మనసులను గెలిస్తే వస్తుంది”
“అన్న మెగాస్టార్ కాబట్టి, తమ్ముడికి సులువుగా ఎంట్రీ దొరకడానికి ఇదేమన్నా సినిమా అనుకుంటున్నావా? ప్రజల మనసులు గెలవడం అంటే గెంతులేసినంత సులువు కాదు. కాల్షీట్స్ అమ్ముకునేంత ఈజీ కాదు క్యాస్ట్‌ను, అభిమానుల్ని తాకట్టు పెట్టడం” అంటూ దెప్పి పొడుస్తున్నారు.