నో స్పీచ్… ఓన్లీ ఓపెనింగ్స్

ఒక ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చారు అంటే ఆ సందడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. రిబ్బన్ కటింగ్ చేసిన ప్రతీ చోటా మైకు పట్టుకుని మీడియా ముందుకో లేక జనం ముందుకో వచ్చి ఊదరగొడతారు.…

ఒక ముఖ్యమంత్రి పర్యటనకు వచ్చారు అంటే ఆ సందడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. రిబ్బన్ కటింగ్ చేసిన ప్రతీ చోటా మైకు పట్టుకుని మీడియా ముందుకో లేక జనం ముందుకో వచ్చి ఊదరగొడతారు. తమ గొప్పలు అన్నీ అన్నీ కావు అని చెప్పుకుంటారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శైలి దానికి పూర్తిగా భిన్నం అనే చెప్పుకోవాలి. విశాఖలో అర డజన్ దాకా ఓపెనింగ్స్ చేసినా అలా నవ్వుతూ అందరినీ పలకరిస్తూ ముందుకు సాగిపోయారంతే. ఎక్కడ స్పీచులు లేవు. మీడియా ముందు హడావుడి లేదు.

విశాఖలో వైఎస్సార్ విగ్రహం ఆవిష్కరణ నుంచి చూసుకుంటే అరిలోవలో కాన్సర్ యూనిట్ ఓపెనింగ్ బీచ్ రోడ్డులో సీ హారియర్స్ మ్యూజియం, స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియం ఓపెనింగ్ ఇలా చాలా వాటికి రిబ్బన్ కటింగ్ చేశారు సీఎం. ఎక్కడా ఒక్క మాట అయితే ఆయన మాట్లాడలేదు.

అక్కడ ఉన్న నిర్వాహకులను అధికారులను పలకరిస్తూ ముందుకు సాగిపోయారు. బహుశా ఈ తరహా టూర్ ఏ సీఎం ది గతంలో జరిగిందా అన్నది ఎవరికీ తెలియదు కానీ అతి తక్కువ సమయంలోనే అనేక ప్రారంభోత్సవాలు చేసి సీఎం షెడ్యూల్ ప్రకారం ముగించేశారు. పాయకరావు పేట ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కుమారుడి వివాహానికి వెళ్ళి ఆయన ముఖంలో నవ్వులు చిందించారు.

అయితే సీఎం రాక తనకు గిఫ్ట్ కాదని, వచ్చే ఎన్నికల్లో మరోసారి టికెట్ తనకు అసలైన బహుమతి అని గొల్ల బాబూరావు భావిస్తున్నారని అంటున్నారు. దానికి ఇంకా చాలా టైం ఉంది. వచ్చే ఎన్నికల్లో బాబూరావుకే తిరిగి టికెట్ దక్కుతుందా లేదా అన్నది తెలియదు కానీ మంత్రి పదవి ఇవ్వలేదని ఆ మధ్య అంతా కొంత అలకబూనిన ఈ సీనియర్ ఎమ్మెల్యే ఇపుడు అధినాయకత్వం తో గుడ్ రిలేషన్స్ నే కొనసాగిస్తున్నారు. 

మంత్రులు అధికారులు కీలక నేతలు అంతా సీఎం టూర్ లో పాల్గొన్నారు. విశాఖ మన రాజధాని అంటూ అడుగడుగున్నా హోర్డింగ్స్ వెలిసాయి. కానీ సీఎం మాత్రం కర్మ యోగి మాదిరిగా జస్ట్ ఓపెనింగ్స్ నో స్పీచ్ అన్నట్లుగానే పర్యటన అంతా సాగించారు. అలా దటీజ్ జగన్ అనిపించేశారు.