జిందాల్ చేతిలోకి ఉక్కు పగ్గాలు…?

ఏపీకి గర్వకారణం, ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు కర్మాగారం జిందాల్ స్టీల్స్ చేతిలోకి వెళ్ళిపోబోతుందా. జిందాల్ కి అప్పగించేందుకు తెర వెనక చురుకుగా కసరత్తు సాగుతోందా. ప్రైవేట్ నుంచి విశాఖ ఉక్కుని దక్కించుకునే…

ఏపీకి గర్వకారణం, ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు కర్మాగారం జిందాల్ స్టీల్స్ చేతిలోకి వెళ్ళిపోబోతుందా. జిందాల్ కి అప్పగించేందుకు తెర వెనక చురుకుగా కసరత్తు సాగుతోందా. ప్రైవేట్ నుంచి విశాఖ ఉక్కుని దక్కించుకునే మార్గం లేదా అంటే జరుగుతున్నా పరిణామాలు అన్నీ చూస్తే ఇదే నిజం అనిపిస్తోంది అంటున్నారు.

నిజానికి విశాఖ ఉక్కు గత ఏడాదిగా రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేస్తోంది. కార్మికులు తమ నిరసనను వినూత్నరూపంలో చూపిస్తున్నారు. ఉక్కు ఉత్పత్తులను పెంచడం ద్వారా పాలకుల మనసు మార్చాలనుకుంటున్నారు. అయితే రెండు కేంద్ర బడ్జెట్లు మారినా కూడా విశాఖ ఉక్కుకు ఉపశమనం కలిగించే చల్లని కబురు అయితే రాలేదు.

ఈ నేపధ్యంలో విశాఖ ఉక్కుని కొనుగోలు చేసేందుకు బడా కార్పోరేట్ సంస్థలు ఒక్కోటిగా ఆసక్తిని కనబరుస్తున్నాయి. మొదట టాటా స్టీల్స్ విశాఖ ఉక్కుని కొంటుందని ప్రచారం జరిగింది. మరి అది ఎంతవరకూ వచ్చిందో తెలియదు, ఈ లోగా అదాని గ్రూప్ విశాఖ ఉక్కుని కైవశం చేసుకుంటుందని కూడా వార్తలు వచ్చాయి.

అయితే వేరే చోట్ల అదాని దృష్టి సారించడంతో ఆది ఆగిపోయింది, ఇక ఊపిరి పీల్చుకోవచ్చు అనుకుంటున్న తరుణంలో సడెన్ గా రంగంలోకి జిందాల్ స్టీల్స్ వచ్చేసింది. విశాఖ ఉక్కుని కొనుగోలు చేయడానికి జిందాల్ స్టీల్స్ పూర్తి ఆసక్తితో ఉందన్నది లేటెస్ట్ టాక్. నవీన్ జిందాల్ నేతృత్వంలోని జిందాల్ స్టీల్స్ విశాఖ స్టీల్ మీద కన్ను వేసిందని అంటున్నారు.

విశాఖ ఉక్కు కర్మాగారానికి 7.3 మిలియన్ టన్నుల వార్షిక సామర్ధ్యం ఉంది. అంతే కాదు, సులువుగా లాభాల బాటలోకి మళ్ళించుకోవచ్చు. పైగా విశాఖ సాగర తీరంలో ఉంది. భారత దేశాన సీ షోర్ లో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్ కావడంతో రవాణా సదుపాయాలు కూడా పెద్ద ఎత్తున చవకగా ఉంటాయన్న ఆలోచిస్తున్నారు.

మరి జిందాల్ కోరిక ఇలా ఉంది. దీనికి సంబంధించి అడుగులు దూకుడుగానే  ముందుకు పడుతున్నాయని అంటున్నారు. ఈ నేపధ్యంలో విశాఖ ఉక్కు భవిష్యత్తు ఏంటి అన్నది అయితే ప్రస్తుతం చర్చనీయాంశం గా ఉంది. చూడాలి విశాఖ ఉక్కు జాతకం ఏమవుతుందో.