పవన్ కల్యాణ్ బట్టలిప్పదీసిన ఆర్జీవీ!

బట్టలు విప్పదీయడం అంటే.. అచ్చంగా పవన్ కల్యాణ్ కు తన సినిమాల్లో ఒక వేషం ఇచ్చి ఆ వేషం పోషించడంలో భాగంగా.. ఆయనతో స్ట్రిప్ టీజ్ చేయించాడని కాదు దాని అర్థం. అంతకంటె ఘోరంగా..…

బట్టలు విప్పదీయడం అంటే.. అచ్చంగా పవన్ కల్యాణ్ కు తన సినిమాల్లో ఒక వేషం ఇచ్చి ఆ వేషం పోషించడంలో భాగంగా.. ఆయనతో స్ట్రిప్ టీజ్ చేయించాడని కాదు దాని అర్థం. అంతకంటె ఘోరంగా.. నడిబజార్లో బట్టలు విప్పదీసి నిల్చోబెట్టినంత అవమానానికి తగినస్థాయిలో.. ఆయన వైఖరి మీద విరుచుకుపడుతున్నాడని అర్థం. 

పవన్ కల్యాణ్ చాలా నంగినంగిగా.. తాను తెలుగుదేశం ఎదుట, చంద్రబాబు నాయుడు పాదాల వద్ద సాగిలపడుతున్న వైఖరి గురించి సమర్థించుకుంటూ.. పొత్తుల గురించి ప్రెస్ మీట్ లో ప్రకటించడంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. అతి భయంకరమైన సెటైరికల్ కౌంటర్ ఇచ్చారు. 

‘2019లో నన్ను నేను ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రొజెక్టు చేసుకుంటున్నా’ అనే పవన్ కల్యాణ్ డైలాగుతో మొదలుపెట్టిన వీడియోలో.. ఆ ఎన్నికల్లో 30-40 సీట్లు తమ పార్టీకి వచ్చి ఉంటే ఇవాళ తమ పరిస్థితి చాలా బాగా ఉండేదని చెప్పుకొచ్చిన పవన్ తీరును ఆయన తన ట్వీట్ లో ఎండగట్టారు.

‘‘ఈ మాత్రం దానికి నీకో పార్టీ.. పిడికిలి, ఎర్ర కండువాలు, చేగువేరాలు’’ అంటూ డైరక్టుగా పవన్ ను ఉద్దేశించి వెటకారం చేస్తూ ఆ వీడియోకు ఒక కేప్షన్ కూడా పెట్టారు. 

ఆర్జీవీ పవన్ కల్యాణ్ ను అంతటితో వదలిపెట్టలేదు. ‘‘తన సొంత ఫ్యాన్స్ నే కాకుండా, తన కాపుల్ని, చివరికి తనని తానే వెన్నుపోటు పొడిచేసుకున్నాడు.’’ అంటూ మరింత ఘాటైన విమర్శ చేశారు. 

ఆ రోజు చంద్రబాబునాయుడు, తన మామా ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన దానికన్నా దారుణంగా ఈ రోజు పవన్ కల్యాణ్ తన జనసైనికులని , తన  ఫ్యాన్స్ ని  వెన్నుపోటు పొడిచి చంపేసాడు.. వాళ్ళ  ఫ్యామిలీ మెంబెర్స్  అందరికీ నా ప్రగాఢ సానుభూతి.’’ అంటూ రాంగోపాల్ వర్మ తన వెటకారాన్ని పీక్స్ కు తీసుకువెళ్లారు.

న్యూట్రల్ గా ఉంటూ అప్పుడప్పుడూ ఇలాంటి తీవ్రమైన పొలిటికల్ కామెంట్స్ చేస్తూ ఉండే రాంగోపాల్ వర్మకే పవన్ కల్యాణ్ తాజా ప్రకటన ఇంతగా కడుపు మండించింది అంటే.. యిక.. జనసైనికులకు ఎంతగా కడుపు రగిలిపోతూ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. తెలుగుదేశంతో పొత్తుల విషయంలో పవన్ కల్యాణ్ ఎంత దిగజారుడు వైఖరితో ఉన్నారా.. తాజాగా గురువారం ఆయన మాటల్లో తేలిపోయింది. ఆర్జీవీ కూడా ఈ స్థాయిలో తనకు తాను వెన్నుపోటు పొడుచుకున్న పవన్ అంటూ.. వెటకరించాడు. 

ఆర్జీవీ కామెంట్స్ కు అంతకంటె ఘోరమైన భాషలో ప్రతిస్పందించడానికి.. పవన్ అన్నయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు రెడీ అవుతుండవచ్చు గాక.. కానీ, ఇవాళ్టి మాటలతో యావత్ ఆంధ్రప్రజల ఎదుట పవన్ పరువు సాంతం సర్వనాశనం అయిపోయిందనడం నిజం.