బ్రేకింగ్..ఎన్టీఆర్..ఎపిసోడ్ కు 30 లక్షలు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టీవీ తెరపై కనిపించబోతున్నాడని గ్రేట్ ఆంధ్ర న్యూస్ బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరిన్ని అప్ డేట్లు మీ కోసం. ఈ షో మరో రెండు నెలల్లో ప్రారంభం…

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టీవీ తెరపై కనిపించబోతున్నాడని గ్రేట్ ఆంధ్ర న్యూస్ బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరిన్ని అప్ డేట్లు మీ కోసం. ఈ షో మరో రెండు నెలల్లో ప్రారంభం కాబోతోంది. 

ఇవి 60 ఎపిసోడ్ లు. ఒక్కో ఎపిసోడ్ కు ఎన్టీఆర్ కు ఇచ్చే రెమ్యూనిరేషన్ 30 లక్షలు.  అంటే టోటల్ గా జెమిని టీవీ నుంచి ఎన్టీఆర్ వచ్చేది 18 కోట్లు.

తెలుగు టీవీ చరిత్రలో ఇది అతి పెద్ద రెమ్యూనిరేషన్ గా అనుకోవచ్చు. మీలో ఎవరు కోటీశ్వరుడు తరహాలో సాగే ఈ కార్యక్రమానికి కొత్త పేరు ఫిక్స్ చేస్తున్నారు అది కూడా త్వరలో వెల్లడి అవుతుంది.

ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చేస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరుకు ఆ సినిమా నుంచి బయటకు వస్తారు. ఆ తరువాత త్రివిక్రమ్ డైరక్షన్ లో హారిక హాసిని నిర్మించే సినిమా స్టార్ట్ అవుతుంది.

అభిజిత్ చాలా కేరింగ్ పర్సన్