చంద్రబాబు మౌనం వెనక కారణం ఏంటి..?

తెలుగు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను మారుస్తున్నారంటూ ప్రముఖంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు చంద్రబాబు మౌనంగా ఉండటమే అందరిలో అనుమానాలు రేకెత్తిస్తోంది.  Advertisement వాస్తవానికి ఇలాంటి కీలక నిర్ణయాలన్నీ చంద్రబాబుకి చేరవేసేందుకే హస్తినలో…

తెలుగు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను మారుస్తున్నారంటూ ప్రముఖంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు చంద్రబాబు మౌనంగా ఉండటమే అందరిలో అనుమానాలు రేకెత్తిస్తోంది. 

వాస్తవానికి ఇలాంటి కీలక నిర్ణయాలన్నీ చంద్రబాబుకి చేరవేసేందుకే హస్తినలో ఆయన వేగులు పనిచేస్తున్నారు. వారికి లేని సమాచారం ముందుగా పత్రికలకు ఎలా వెళ్లింది. అసలు పత్రికల కంటే ముందు సీపీఐ నారాయణ ఈ వ్యవహారంపై ఎందుకు రాద్ధాంతం చేశారనేదే ఇప్పుడు చర్చనీయాంశం.

“తెలుగు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను మార్చేసేందుకు కుట్రలు చేస్తున్నారు, ఢిల్లీ కేంద్రంగా లాబీయింగ్ జరుగుతోంది, కేంద్రానికి బేషరతుగా జగన్ మద్దతిస్తున్నందుకు ప్రతిఫలంగా ఈ పనిచేస్తున్నార”ని కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు నారాయణ.

నారాయణ ఆ వ్యాఖ్యలు చేసిన రోజుల వ్యవధిలోనే న్యాయమూర్తుల మార్పుపై ప్రముఖ దినపత్రికల్లో వార్తలు రావడం విశేషం. అయితే ఇటీవలే కేంద్ర హోం మంత్రిని తెలంగాణ సీఎం కేసీఆర్ కలవడం, ఆ తర్వాత సీఎం జగన్ కూడా ఆయనతో భేటీ కావడం, జగన్ ఢిల్లీలో ఉండగానే న్యాయమూర్తుల మార్పుపై వార్తలు రావడం.. వీటన్నిటికీ మధ్య సంబంధం ఏదైనా ఉందా అనేది మాత్రం ప్రస్తుతానికి అనుమానమే.

కొలీజియం స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకున్నా.. దాని వెనక కేంద్రం సూచనలు, సలహాలు ఉంటాయనే విషయాన్ని కొట్టిపారేయలేం. ఈ దశలో కేంద్రం సిఫార్సుతోటే కొలీజియం న్యాయమూర్తుల మార్పుపై నిర్ణయం తీసుకుందా, అలా కేంద్రం సిఫార్సు చేయడం వెనక నిజంగానే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాధినేతల లాబీయింగ్ ఉందా అనేది సస్పెన్స్ గా మారింది. 

అన్నిటికంటే సంచలనం ఏంటంటే.. చంద్రబాబు ఈ విషయంపై మౌనంగా ఉండటం. ఈ విషయం తెలిసి కూడా చంద్రబాబు మౌనాన్ని ఆశ్రయించారా లేక, నారాయణతో ముందుగా బాబే లీకులిప్పించారా అనేది తేలాల్సి ఉంది.

ఒక వేళ బాబు మౌనం వ్యూహాత్మకమే అయితే దాని వెనక ఏదో పెద్ద కారణం ఉండే ఉంటుంది. ఇటీవల ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో వరుస ఎదురు దెబ్బలు తగులుతున్న నేపథ్యంలో న్యాయమూర్తుల మార్పుపై వార్తలు రావడం, పదే పదే న్యాయమూర్తులను వెనకేసుకొచ్చే చంద్రబాబు మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోంది. 

అభిజిత్ చాలా కేరింగ్ పర్సన్