బహుశా ఇది తొలిసారేమో? ఓ సినిమా సెలబ్రిటీ తన కాంట్రావర్సీ లైఫ్ ను తెర మీదకు తానే తెచ్చుకోవడం. తానే నిర్మించి, తానే నటించడం. అది కూడా తాను ఇంకా ఫుల్ ఫామ్ లో వుండగానే. ఇదంతా సీనియర్ నరేష్-పవిత్రా లోకేష్ ల ‘మళ్లీ పెళ్లి’ సినిమా ముచ్చటే.
ఈ సినిమా ట్రయిలర్ బయటకు వచ్చింది. ఒక విధంగా ఇది బోల్డ్ అంటెప్ట్ అనుకోవాలి. నరేష్ పెళ్లిళ్ల సంగతులు, భార్యతో గొడవలు, పవిత్రా లోకేష్ తో లివింగ్ టుగెదర్ ఇవన్నీ జనాలకు పబ్లిక్ గా తెలిసిన సంగతులే. ఇప్పుడు ఇవే సంగతులు తెర మీదకు తెచ్చారని ట్రయిలర్ చెప్పేసింది.
అందరికీ తెలిసిన సంగతులనే తెరమీదకు తీసుకువస్తూ, తెలియని సంగతులు మేళవిస్తూ, చిన్న థ్రిల్లర్ లుక్ కూడా ఇఛ్చారు. అందువల్లే ట్రయిలర్ వైరల్ గా మాత్రమే కాకుండా ఇంట్రస్టింగ్ గా మారింది. కథలో నరేష్ కు కాస్త నెగటివ్ షేడ్ కూడా వున్నట్లు కనిపిస్తోంది. అలాగే నరేష్ మాజీ భార్య విషయంలో కూడా కాస్త నెగిటివ్ స్టయిల్ లో వెళ్లారు. మొత్తం మీద ఆసక్తికరంగా స్క్రీన్ ప్లే తయారు చేసుకున్నట్లు కనిపిస్తోంది.
ఒకప్పటి బడా నిర్మాత ఇప్పటి దర్శకుడు ఎం ఎస్ రాజు ఈ సినిమాను రూపొందించారు. ఈ నెల 26న విడుదల కాబోతోంది.