తెలుగు స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ పోస్టర్ పై హీరోయిన్ పూనమ్ కౌర్ ఫైర్ అయ్యారు. భగత్ సింగ్ పేరును పవన్ పాదాల కింద ఉంచడంపై ట్వీట్టర్ వేదికగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
స్వతంత్ర సమరయోధులను గౌరవించలేనప్పుడు కనీసం వారిని అవమానించకండి. ఇటీవల విడుదలైన సినిమా పోస్టర్ లో భగత్ సింగ్ పేరును పాదాల కింద ఉంచడం ద్వారా అవమానించారు.. ఇది ఇగోనా? నిర్లక్ష్యమా? అంటూ.. దీన్ని వెంటనే భగత్ సింగ్ యూనియన్‌కు రిపోర్ట్ చేయండి అని ట్వీట్ వేసింది.
పూనం ట్వీట్ పై పవన్ కళ్యాణ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. పనీ పాట లేకుండా ఉన్నట్టుగాన్నావ్.. అందుకే ఇలాంటి ట్వీట్లు వేసుకుంటూ ఉంటున్నావ్ అని కౌంటర్లు వేస్తున్నారు. మరోవైపు నోరు తెరిస్తే పెద్ద పెద్ద మాటలు చెప్పే పవన్ కళ్యాణ్ పూనం ట్వీట్ కు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా గతంలో కూడా కొన్ని రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఫాన్స్- పూనమ్ కౌర్ మధ్య కోల్డ్ వార్ నడిచిన విషయం తెలిసిందే.