ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఆగింది.. బండ్ల కూడా ఆపేశాడు

“సూర్యుడి తేఙస్సుకు…చంద్రుడి చల్లదనానికి…పవన్ పై అభిమానానికి ఎక్సపయిరీ డేట్ లేదు.” Advertisement “పవన్…అంటే వాయువు. అది లేని చోటు భూమిపై లేదు. పవన్ పై అభిమానం కూడా వాయువులా అనంతం.” “ఈశ్వరా..పవనేశ్వరా..పవరేశ్వరా..” ఈరోజు పొద్దున్నుంచి…

“సూర్యుడి తేఙస్సుకు…చంద్రుడి చల్లదనానికి…పవన్ పై అభిమానానికి ఎక్సపయిరీ డేట్ లేదు.”

“పవన్…అంటే వాయువు. అది లేని చోటు భూమిపై లేదు. పవన్ పై అభిమానం కూడా వాయువులా అనంతం.”

“ఈశ్వరా..పవనేశ్వరా..పవరేశ్వరా..”

ఈరోజు పొద్దున్నుంచి బండ్ల గణేష్ ట్వీట్ల ప్రవాహం ఇది. గతంలో తను వివిధ ఫంక్షన్లలో పవన్ కల్యాణ్ గురించి మాట్లాడిన వీడియోలు వీటికి అదనం. ఇలా ఉదయం నుంచి ఏకథాటిగా పవన్నామస్మరణ చేస్తూనే ఉన్నాడు బండ్ల గణేష్.

ఈరోజు పవన్ కల్యాణ్ హీరోగా నటించిన భీమ్లానాయక్ సినిమాకు సంబంధించి ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరగాల్సి ఉంది. ఆ ఫంక్షన్ కు బండ్లకు ఆహ్వానం అందలేదంటూ ప్రచారం జరిగింది. దీనికి సంబంధించి లీకైన ఓ ఆడియో క్లిప్ కూడా వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి బండ్ల వేస్తున్న ట్వీట్లు చర్చనీయాంశమయ్యాయి. ఎప్పుడైతే భీమ్లానాయక్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ వాయిదా పడిందంటూ ప్రకటన వచ్చిందో, ఆ వెంటనే బండ్ల నుంచి ట్వీట్లు కూడా ఆగిపోయాయి.

పవన్ కల్యాణ్ ఫంక్షన్లలో బండ్ల గణేశ్ ప్రత్యేక ఆకర్షణ. దీన్ని ఎవ్వరూ కాదనలేరు. స్టేజ్ ఎక్కి పూనకం వచ్చినట్టు పవన్ కల్యాణ్ ను బండ్ల గణేశ్ పొగుడుతుంటే.. ఆడియన్స్ తో పాటు పవన్ కూడా కడుపుబ్బా నవ్వుకుంటారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. బండ్ల-త్రివిక్రమ్ కు పడట్లేదనేది ఓపెన్ సీక్రెట్ అయింది. కాబట్టి భీమ్లానాయక్ ఫంక్షన్ కు బండ్లకు ఆహ్వానం అందదనేది కూడా పక్కా.

ఈ నేపథ్యంలో, ఫంక్షన్ కు తనను కూడా పిలవాలనే ఉద్దేశంతో, ఉదయం నుంచి బండ్ల గణేశ్, అందర్నీ ఆకర్షించేలా, పవన్ ను పొగుడుతూ ట్వీట్లు పెడుతున్నాడనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తూ.. భీమ్లానాయక్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పోస్ట్ పోన్ అయిందనే న్యూస్ బయటకొచ్చిన వెంటనే బండ్ల ట్వీట్ల వర్షం కూడా ఆగిపోయింది.

త్వరలోనే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. పవన్ కల్యాణ్ కూడా స్వయంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఈ విషయాన్ని కన్ ఫర్మ్ చేశారు. మరి ఈరోజు మిస్సయిన ఆహ్వానం, ఆ రోజైనా బండ్లకు అందుతుందా అనేది చూడాలి.