సైలెంట్ గా ఓటీటీలోకి సమంత సినిమా

థియేటర్లలో డిజాస్టర్ అయిన సినిమాను, ఓటీటీలు కూడా పట్టించుకోవడం లేదనే విషయాన్ని ఇదివరకే మనం చెప్పుకున్నాం. కనీసం ప్రచారం కూడా లేకుండా స్ట్రీమింగ్ కు పెట్టేస్తున్నాయనే విషయాన్ని గమనించాం. ఇప్పుడీ కోవలోకి శాకుంతలం సినిమా…

థియేటర్లలో డిజాస్టర్ అయిన సినిమాను, ఓటీటీలు కూడా పట్టించుకోవడం లేదనే విషయాన్ని ఇదివరకే మనం చెప్పుకున్నాం. కనీసం ప్రచారం కూడా లేకుండా స్ట్రీమింగ్ కు పెట్టేస్తున్నాయనే విషయాన్ని గమనించాం. ఇప్పుడీ కోవలోకి శాకుంతలం సినిమా కూడా చేరింది.

సమంత లీడ్ రోల్ పోషించిన ఈ సినిమా థియేటర్లలో డిజాస్టర్ అయింది. పెట్టిన పెట్టుబడిలో 10శాతం కూడా వెనక్కు రాలేదనేది ట్రేడ్ టాక్. ఇలా ఈ ఏడాది అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకున్న శాకుంతలం సినిమాను అమెజాన్ ఓటీటీ కూడా పట్టించుకోలేదు.

సైలెంట్ గా తమ ఓటీటీలో శాకుంతలంను స్ట్రీమింగ్ కు పెట్టేసింది అమెజాన్. బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ సినిమా వస్తోందంటూ కనీసం ఒక ట్వీట్ కూడా వేయలేదు సదరు కంపెనీ. సినిమా ఫ్లాప్ అయితే ఓటీటీలో అట్లుంటది మరి. ఇంతకుముందు కబ్జా, రావణాసుర సినిమాల విషయంలో కూడా ఇలానే వ్యవహరించింది అమెజాన్.

ఇక ఈ సినిమాతో '7 వారాల' నిబంధనను దిల్ రాజు కూడా పక్కనపెట్టినట్టయింది. టాలీవుడ్ కు గైడ్ లైన్స్ సెట్ చేసే కీలక సభ్యుల్లో ఒకడిగా చలామణి అవుతున్న రాజు, అందరితో కలిసి తను సెట్ చేసిన రూల్స్ ను తానే అతిక్రమించారు. అయితే టాలీవుడ్ లో ఇది కామన్. ఇప్పటికే ఎంతోమంది నిర్మాతలు ఈ రూల్ ను బ్రేక్ చేశారు. ఇప్పుడు దిల్ రాజు వంతు వచ్చిందంతే.