దర్శకుడు హరీష్ శంకర్ తన ఉస్తాద్ సినిమా కోసం పట్టుమని అయిదు రోజులు షూట్ చేయలేదు. బ్రో సినిమా మొత్తానికి డేట్ లు ఇచ్చారు, ఓజి కి కంఫర్టబుల్ గా డేట్ లు ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఉస్తాద్ సినిమాకు ఓ అయిదు రోజులు ఇచ్చారు. ఆ అయిదు రోజులకే గ్లింప్స్ అంటూ తెగ హడావుడి చేస్తున్నారు.
కాలు ఓసారి, మొహం ఓసారి, బూట్లు మరోసారి చూపిస్తూ ఫ్యాన్స్ ను తెగ ఊరిస్తున్నారు. మరో ఏడాదికి కానీ విడుదల కాని సినిమాకు గ్లింప్స్ అనడమే చిత్రం.
పైగా దానిని థియేటర్ లో ప్రదర్శించడం కూడా అదనమే. పోనీ ఇవన్నీ ఏమన్నా గుర్తుండేంత దూరంలో సినిమా వస్తుందా అంటే అదీ లేదు.
ఇప్పుడు ఇమ్మీడియట్ గా బ్రో విడుదలవుతుంది. డిసెంబర్ లో ఓజి విడుదల అవుతుంది. ఎప్పుడో సమ్మర్ లో రావడానికి ఉస్తాద్ అవకాశం వుంటుంది. ఉస్తాద్ సినిమాకు 100 రోజులు డేట్ లు అడిగారు హీరోని అని టాక్ వుంది. అంటే ఇంకా 95 రోజులు షూట్ వుంది.
ఈ లోగా ఎన్నికలే వస్తాయో, ఇంకేం ఆటంకాలు వస్తాయో తెలియదు. పూర్తి అయితే కచ్చితంగా ఆనందమే. ఎందుకుంటే హరీష్ శంకర్ ఎప్పటి నుంచో ఈ సినిమా మీదే వుండిపోయారు. కానీ ఆది కి ముందే ఈ హడావుడి చూస్తుంటే మాత్రం భలే ఫన్నీగా వుంది.
అసలే ఓజి సినిమా వచ్చి హరీష్ శంకర్ ఉస్తాద్ ను వెనక్కు తోసింది. అది అనౌన్స్ కానంత వరకు పవన్ లైనప్ లో బెస్ట్ ఛాయిస్ హరీష్ సినిమానే. కానీ ఇప్పుడు ఫస్ట్ చాయిస్ ఓజి అయిపోయింది.
అందుకే హరీష్ ఈ హడావుడి అంతా చేస్తున్నారేమో? ఈ సంగతులు అన్నీ అలా వుంచితే పాపం, హరి హర వీరమల్లు సినిమాను తలుచుకుంటేనే జాలేస్తుంది.