నాగార్జునకు శివ..చైతూకి కస్టడీ

నాగ చైతన్య,- మేకర్ వెంకట్ ప్రభు ల తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ 'కస్టడీ'. కృతి శెట్టి కథానాయిక. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ సినిమా ని నిర్మించారు.…

నాగ చైతన్య,- మేకర్ వెంకట్ ప్రభు ల తెలుగు-తమిళ ద్విభాషా ప్రాజెక్ట్ 'కస్టడీ'. కృతి శెట్టి కథానాయిక. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌ పై నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ సినిమా ని నిర్మించారు. పవన్‌కుమార్‌ సమర్పిస్తున్నారు. సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో నిర్మాత శ్రీనివాస చిట్టూరి విలేకరుల సమావేశంలో కస్టడీ విశేషాలని పంచుకున్నారు.  

తమిళ దర్శకులే ఎందుకంటే..

మన దర్శకులు కూడా బాగా బిజీగా ఉన్నారు కదా. అందరికి రెండు మూడు సినిమాలు ఉన్నాయి. ‘గ్యాంబ్లర్’ సినిమా నుంచి వెంకట్ ప్రభుతో సినిమా చేయాలని అనుకున్నాను. తన స్క్రీన్ ప్లే, ఆలోచించే విధానం నాకు చాలా ఇష్టం. ఎంత పెద్ద సీరియస్ ఇష్యూ ని కూడా మంచి స్క్రీన్ ప్లే లో ఎంటర్ టైన్ మెంట్ గా చెప్పగలరు. కథ, మంచి స్క్రీన్ ప్లే. తెలుగు ప్రేక్షకులకు నచ్చే ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ తో సీరియస్ కథ జరుగుతుంటుంది. సీరియస్ లో కూడా ఎంటర్ టైన్ మెంట్ వుంటుంది. ఈ రెండిటిని దర్శకుడు మిక్స్ చేసిన విధానం నాకు చాలా నచ్చింది. తెలుగు ఎమోషన్స్ తో ఒక హాలీవుడ్ సినిమా చూసిన అనుభూతి కలుగుతుంది.

మొదటి నుంచీ ద్విభాషా చిత్రమే

పోలీస్ కథ అంటే యూనివర్సల్ అప్పీల్ వుంటుంది అన్నది వాస్తవమే. కానీ మొదటి నుంచి ఇది బైలింగ్వెల్ చిత్రం అనుకున్నాం. బైలింగ్వెల్ కూడా తెలుగు కి ప్రత్యేకమైన షాట్, తమిళ్ కి ప్రత్యేకమైన షాట్ తీశాం. రెండు సినిమాలు తీసినట్లే. హిందీలో తర్వాత వుంటుంది. తెలుగు వారికి నచ్చే విధంగా, తమిళం వారు ఇష్టపడే విధంగా సినిమా వుంటుంది. తెలుగు లో వెన్నెల కిషోర్ వున్నారు. ఆ పాత్ర ని తమిళ్ లో ప్రేమ్ జీ చేశారు. ఆ ఒక్క పాత్రలో మార్పు వుంటుంది. మిగిలినవి యాజిటీజ్.

ఇద్దరూ ఎందుకంటే..

ఇది 90లో జరిగే కథ. ఇలాంటి సినిమాకి నేపధ్యం సంగీతం ఇళయరాజా అయితే బావుంటుందని ఆయన్ని తీసుకోవడం జరిగింది. కథ వినగానే ఇళయరాజా, యువన్ మేము చేస్తామని ముందుకు రావడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.

బడ్జెట్ ఎంతంటే..?

యూటర్న్ తీసేనాటికి సమంత మార్కెట్ ఏమిటో ఎవరికీ తెలీదు. కథ నచ్చి చేశాను. కథకు కావాల్సింది ఖర్చుపెట్టాను. అలాగే గోపిచంద్ సిటిమార్, రామ్ వారియర్ వారి కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ సినిమాలు. కథ నచ్చే చేశాను. కస్టడీ కూడా నాగ చైతన్య కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ మూవీ. బడ్జెట్ లెక్కలు వేసుకోకుండా కథకు కావాల్సింది ఖర్చు పెట్టాం. అవుట్ పుట్ అద్భుతంగా వచ్చింది. కంటెంట్ పరంగా, బిజినెస్ పరంగా హ్యాపీ గా వున్నాను. ఇంగ్లీష్ పేర్లు పెట్టాలని ప్రత్యేకంగా ఏమీ కోరిక లేదు. కథకు తగ్గట్టుగా కుదిరాయి. ఈసారి మాత్రం చక్కని తెలుగు టైటిల్ తో వస్తున్నాం.

చైతన్యకు ది బెస్ట్

చైతన్య కెరీర్ లోనే హయ్యస్ట్ ఫిల్మ్ అవుతుంది. నాగార్జున కెరీర్ లో ‘శివ’ ఎలా గుర్తుండి పోయిందో నాగచైతన్య కెరీర్ లో కస్టడీ అలా గుర్తుండిపోతుంది. శివ సినిమానే కాదు అందులో పాత్రలు ఎలా గుర్తుండిపోయాయో.. కస్టడీలోని అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి.. పాత్రలు గుర్తుండిపోతాయి. ప్రతి పాత్ర యూనిక్ గా వుంటుంది. అరవింద్ స్వామి కథ వినగానే మరో ఆలోచన లేకుండా ఈ పాత్ర చేస్తానని చెప్పారు. థియేటర్ లో ఆయన పాత్రని ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు. టెర్రిఫిక్ గా అదే సమయంలో చాలా ఎంటర్టైనింగ్ గా వుంటుంది ఆయన పాత్ర. శరత్ కుమార్ పాత్ర కూడా చాలా పవర్ ఫుల్ గా వుంటుంది. రెండు కొండల మధ్య చిట్టెలుక వుంటే ఎలా వుంటుందో అరవింద్ స్వామి, శరత్ కుమార్ మధ్య నాగచైతన్య పాత్ర అలా కనిపిస్తుంది. ప్రియమణి ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తారు. ఇందులో ట్రాకులు వుండవు. ఒక సీన్ కి వచ్చి వెళ్ళిపోయే పాత్ర వుండదు, అలాగే పాటల్లో కనిపించి వెళ్ళిపోయే హీరోయిన్ వుండదు. మొదటి సీన్ నుంచి చివరి దాక ఒక ఇంటర్ లింక్ వుంటుంది. ప్రతి పాత్రకు ప్రాముఖ్యత వుంటుంది.

అండర్ వాటర్ సీన్

తెలుగు స్క్రీన్ మీద ఇలాంటి అండర్ వాటర్ సీక్వెన్స్ చూసి వుండరు. హలీవుడ్ స్టైల్ లో మన ఎమోషన్స్ తో చాలా ఎక్స్ టార్డినరి గా వుంటుంది. దాదాపు ఇరవై రోజులు ఈ సీక్వెన్స్ చేశాం. డైలీ రెండు కాల్షీట్లు పైనే  అయ్యేది. మైసూర్, రాజమండ్రి ప్రాంతాల్లో షూట్ చేశాం. అలాగే  దిని కోసం స్పెషల్ గా సెట్ కూడా వేశాం. ఇందులో  నాలుగు యాక్షన్ సీక్వెన్స్ లు అద్భుతంగా ఉంటాయి.