మొగ్గలోనే కాపీ నా తిన్ననూరీ?

పువ్వు పుట్టగానే దాని వాసన తెలిసిపోతుందంటారు. ఈ మధ్య అందరూ పీరియాడిక్ స్పై సినిమాల మీద పడ్డారు. ఇప్పటికే కళ్యాణ్ రామ్, నిఖిల్ సినిమాలు దాదాపు నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి.  Advertisement ఇప్పుడు గౌతమ్…

పువ్వు పుట్టగానే దాని వాసన తెలిసిపోతుందంటారు. ఈ మధ్య అందరూ పీరియాడిక్ స్పై సినిమాల మీద పడ్డారు. ఇప్పటికే కళ్యాణ్ రామ్, నిఖిల్ సినిమాలు దాదాపు నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయి. 

ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి, సితార కాంబినేషన్ లో విజయ్ దేవరకొండ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చింది. మన కథకులు, దర్శకులకు ఎక్కడో చిన్న థ్రెడ్ దొరకాలి. దాన్ని బట్టి మన స్టయిల్ కు మార్చుకుంటూ వెళ్లిపోతారు. అదేమంటే ఇన్ స్పైర్ అంటారు లేదా కో ఇన్సిడెంట్ అంటారు. ఈ కాపీ కథలకు కోట్లకు కోట్లు కుమ్మరిస్తారు. మన సినిమాలు ఏవి చూడండి, ఎక్కడో అక్కడ కొరియన్ మూలాలు లేదా హాలీవుడ్ మూలాలు కనిపిస్తాయి.

ఇంతకీ గౌతమ్ తిన్ననూరి-విజయ్ దేవరకొండ సినిమా సంగతి చూస్తే నిన్నటికి నిన్న ఓ పోస్టర్ వదిలారు. హీరో ఫేస్ వున్న డ్రాయింగ్ ను నీట్ గా ముక్కలుగా కట్ చేసి, మళ్లీ పక్క పక్కన పెడితే ఎలా వుంటుందో అలా డిజైన్ చేసారు పోస్టర్ ను. దాంతో పరిశోధన మొదలైంది. 

రహస్య సమాచారం ఇతరుల కంట పడకుండా మెషీన్ లో వేసి ముక్కలు చేయడం అన్నది కామన్. గూఢచారులు కూడా ఇలాగే చేసేవారు. ఇదే పాయింట్ మీద కీలకంగా ఆర్గో అనే సినిమా వచ్చిన సంగతిని బయటకు లాగారు. గమ్మత్తేమిటంటే ఆ సినిమాకు కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి పోస్టర్ వేసిన సంగతి కూడా బయటకు వచ్చింది.

దీంతో నిర్మాత నాగవంశీ రంగంలోకి దిగారు. ఇది జస్ట్ కో ఇన్సిడెన్స్ తప్ప వేరు కాదంటూ వివరణ ఇచ్చుకున్నారు. అంతకన్నా ఏమంటారు? మా డైరక్టర్ డిజైన్ కాపీ కొట్టేసాడు అని చెబుతారా ఏంటీ? మన దర్శకులు కాస్త పేరు, డబ్బు వస్తే చాలు కొత్త సబ్జెక్ట్ కోసం క్రియేటివిటీ పక్కన పెట్టి హాలీవుడ్, కొరియన్ సినిమాల కేసి చూడడం కామన్ అయిపోయింది.