సూపర్ స్టార్ ఆ సాహసం చేస్తాడా..?

“నాన్న.. పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది”. రజనీకాంత్ పేల్చిన ఈ పంచ్ డైలాగ్ సినిమాల్లో సూపర్ హిట్ అయింది కానీ, రియల్ లైఫ్ లో దీన్ని రజినీ ఫాలో అయ్యేలా…

“నాన్న.. పందులే గుంపుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది”. రజనీకాంత్ పేల్చిన ఈ పంచ్ డైలాగ్ సినిమాల్లో సూపర్ హిట్ అయింది కానీ, రియల్ లైఫ్ లో దీన్ని రజినీ ఫాలో అయ్యేలా లేరు. 

రాబోయే ఎన్నికల్లో ఆయన సింగిల్ గా వచ్చే అవకాశాలు లేవంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

తక్కువ సమయం.. అయోమయంలో క్షేత్రస్థాయి నిర్మాణం..

పార్టీ అనౌన్స్ చేసి ఎన్నికలకు వెళ్లేందుకు రజినీ దగ్గర టైమ్ తక్కువగా ఉంది. పార్టీ కోసం ఏళ్ల తరబడి చర్చించిన రజినీ.. తీరా ఎన్నికల ఏడాదిలోనే అనౌన్స్ మెంట్ అన్నారు.  క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కష్టంగా మారుతుంది. 

ప్రచారంలో భాగంగా అన్ని నియోజకవర్గాల్లో రజనీకాంత్ తిరిగే పరిస్థితి కూడా లేదు. కొన్ని ప్రాంతాల్లో ఇతర పార్టీల నుంచి రజినీ వీరాభిమానులు బరిలో ఉంటారు. అసలే సూపర్ స్టార్ కి మొహమాటం ఎక్కువ, అలాంటి చోట్ల ఎలా చేస్తారో చూడాలి.

బీజేపీకి దగ్గరగా ఉన్నాడనే వార్తలు

ఆధ్యాత్మిక రాజకీయం అనే స్టేట్ మెంట్ ఇచ్చిన రజినీ ఓ కన్ఫ్యూజన్ కి తెరతీశారు. గతంలో పలు సందర్భాల్లో బీజేపీ సిద్ధాంతాలను పొగిడిన రజినీపై తెలియకుండానే కాషాయ ముద్ర పడింది. రీసెంట్ గా  రజినీ బర్త్ డే సందర్భంగా ప్రధాని వేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

అన్నిటికీ మించి బీజేపీ మేథో విభాగం తమిళనాడు అధ్యక్షుడిగా పనిచేసిన అర్జున్ మూర్తిని, తన పార్టీ సమన్వయకర్తగా రజనీ తీసుకోవడంతో బీజేపీ భావజాలం రజినీ పార్టీపై పడే అవకాశముంది.

రజినీకాంత్ సింగిల్ గా వస్తే లాభమేంటి?

– అన్ని స్థానాల్లో పోటీ చేయొచ్చు.
– ఏ పార్టీపైన అయినా విమర్శలు చేయొచ్చు.
– కొత్తగా పెట్టిన పార్టీ అసలు బలం ఎంత అనేది క్లియర్ గా తెలుస్తుంది.
– పార్టీకి తొలి ఎన్నికలు కాబట్టి మంచి రాజకీయ అనుభవం వస్తుంది.

సోలో ఎంట్రీతో వచ్చే నష్టాలు..

– విజయావకాశాలు తక్కువ.
– ఇలా పార్టీ స్థాపించి అలా అధికారం దక్కించుకునే రోజులు ఇప్పుడు లేవని విశ్లేషకులు చెబుతున్నారు.
– సింగిల్ గా వస్తే ఫండింగ్ ఉండదు. ఆర్థికంగా పరిపుష్టిగా ఉండే వాళ్లని ఎన్నుకుంటే అభిమానులు హర్ట్ అవుతారు. అభిమానుల్ని సెలక్ట్ చేసుకుంటే.. ప్రచారం ఖర్చులు కూడా వెదుక్కోవాలి.
– అన్నిటికీ మించి రజినీ దగ్గర సమయం లేదు.

సో.. ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే రజనీకాంత్ సోలోగా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. అటు కమల్ హాసన్ లాంటి వాళ్లు రజనీకాంత్ తో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ.. రజనీ మాత్రం బీజేపీ వైపే మొగ్గుచూపుతున్నట్టు తెలుస్తోంది.

రాబోయే రోజుల్లో రజనీకాంత్ పార్టీ ప్రకటన కంటే.. ఆయన ఏ పార్టీతో చేతులు కలుపుతారనే అంశమే ఎక్కువ ఆసక్తికరంగా మారింది.

ఈ సెగ దేశం మొత్తానికి పాకుతుందా?