ఎక్స్ క్లూజివ్: తాగిన మత్తులో పవన్ కల్యాణ్..!

పవన్ కల్యాణ్ వీర తాగుబోతుగా మారాడు? పొద్దున్న లేస్తే తాగుడు. ఎక్కేవరకు తాగాలి, దిగిన తర్వాత మళ్లీ తాగాలి. ఇలా రాత్రిపగలు తాగుతూ, పచ్చి తాగుబోతుగా మారిపోయాడు పవన్ కల్యాణ్. Advertisement వకీల్ సాబ్…

పవన్ కల్యాణ్ వీర తాగుబోతుగా మారాడు? పొద్దున్న లేస్తే తాగుడు. ఎక్కేవరకు తాగాలి, దిగిన తర్వాత మళ్లీ తాగాలి. ఇలా రాత్రిపగలు తాగుతూ, పచ్చి తాగుబోతుగా మారిపోయాడు పవన్ కల్యాణ్.

వకీల్ సాబ్ సినిమాలో పవన్ కల్యాణ్ క్యారెక్టర్ ఇది. ఈ సినిమాలో పవన్ లాయర్ గా కనిపించబోతున్నాడనే సంగతి అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా వచ్చేశాయి. అయితే సినిమాలో పవన్ కు మరో షేడ్ కూడా ఉంటుంది. అదే తాగుబోతు గెటప్.

సినిమాలో పవన్ ను పరిచయం చేయడమే ఇలా తాగుబోతుగా పరిచయం చేయబోతున్నారట. నిజానికి ఈ యాంగిల్ ను సీక్రెట్ గా ఉంచాలనుకోవడం లేదు యూనిట్. సంక్రాంతికి విడుదల చేయబోతున్న టీజర్ లో కూడా ఈ గెటప్ ను కొద్దిగా చూపించబోతున్నారట.

జల్సా, గుడుంబా శంకర్, ఖుషీ, బద్రి లాంటి ఎన్నో సినిమాల్లో తాగుబోతు సన్నివేశాల్లో నటించాడు పవన్ కల్యాణ్. అయితే అందులో తాగి కామెడీ చేశాడు. బద్రి, జల్సా, ఖుషి సినిమాల్లో పవన్ తాగి నటించిన సన్నివేశాలు బాగా పండాయి. 

మరి వకీల్ సాబ్ లో తాగుబోతు గెటప్ లో పవన్ కామెడీ పండించాడా లేక సీరియస్ గా ఫైట్స్ చేశాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

ఈ సెగ దేశం మొత్తానికి పాకుతుందా?