హీరో-డైరక్టర్-క్యారెక్టర్ ఆర్టిస్ట్

తెలుగు తెరపైకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాహుల్ రవీంద్రన్.  కానీ అంతలోనే మొహమాటపు క్యారెక్టర్లు కొన్ని చేసాడు. అంతలో డైరక్టర్ గా మారాడు. మంచి డైరక్టర్ అనిపించుకున్నాడు. కానీ అంతలోనే నాగ్ తో మన్మధుడు…

తెలుగు తెరపైకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాహుల్ రవీంద్రన్.  కానీ అంతలోనే మొహమాటపు క్యారెక్టర్లు కొన్ని చేసాడు. అంతలో డైరక్టర్ గా మారాడు. మంచి డైరక్టర్ అనిపించుకున్నాడు. కానీ అంతలోనే నాగ్ తో మన్మధుడు 2 సినిమా చేసి, మొత్తం ఇమేజ్ మైనస్ చేసేసుకున్నాడు.

తొలిసినిమా తరువాత చకచకా అడ్వాన్స్ లు తీసుకున్నాడు. కానీ మన్మధుడు 2 తరువాత అవన్నీ ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. దాంతో ఇప్పుడు మళ్లీ క్యారెక్టర్ యాక్టర్ గా మారాడు.

నాని చేస్తున్న శ్యామ్ సింగ రాయ్ లో హీరో అన్నగా నటిస్తున్నాడు.నాని తరువాత ఎంట్రీ ఇచ్చి  ఇప్పుడు నాని కే అన్నగా మారిపోయాడు. అయితే డైరక్షన్ మాత్రం ఇంకా వదలలేదు. 

రెండు బ్యానర్లలో రెండు సినిమాలు చేయడానికి హీరోలకు కథలు చెప్పి ఒప్పించే పనిలో పడ్డాడు. ఆ ప్రయత్నాలు సక్సెస్ అయితే సరే, లేదూ అంటే ఇంక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడిపోవాలేమో?

ఈ సెగ దేశం మొత్తానికి పాకుతుందా?