సినిమా ఇండస్ట్రీని జగన్ నాశనం చేసేస్తున్నారు. థియేటర్ల వ్యవస్థ ను చంపేస్తున్నారు అంటూ ఒకటే యాగీ. లైసెన్స్ లు రెన్యూవల్ చేయకుండా థియేటర్లు నడిపేస్తుంటే ఊరుకోకుండా దాడులు చేస్తున్నారు అంటూ నానా గోల. అంతే తప్ప సేఫ్టీ లైసెన్స్ లు లేకుండా వ్యాపారం ఏంటీ అని ఎవ్వరూ అడగలేదు.
సరే ఇప్పుడు ఆంధ్రలో మళ్లీ పరిస్థితులు మామూలు అయిపోయాయి. దాడులు ఆపేసారు. సైలెంట్ గా యూనిఫారమ్ 100 రూపాయలు అమ్మేస్తున్నారు. బయ్యర్లు ధైర్యంగా సినిమాలు కొనేస్తున్నారు.
ఆడవాళ్లు మీకు జోహార్లు…ఆంధ్ర (సీడెడ్ కాకుండానే) 9 కోట్ల రేషియో, భ్మీమ్లా నాయక్ (సీడెడ్ కాకుండానే) 40 కోట్ల రేషియో లో విక్రయించేసారు అంటే జగన్ మార్కు రేట్లు కిట్టుబాటు అవుతాయని కాదు. యూనిఫారమ్ 100 రూపాయలు అమ్ముకోగలుగుతున్నారని.
డిజె టిల్లు లాంటి చిన్న సినిమా ఆంధ్ర (సీడెడ్ కాకుండా) లో మూడు కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. సీడెడ్ లో కోటి రూపాయలు రాబట్టింది. రౌడీ బాయిస్ లాంటి సినిమా వైజాగ్ ఏరియాలో కొటికి పైగా వసూళ్లు తెచ్చుకుంది. అఖండ సినిమా కలెక్షన్ల సంగతి చెప్పనక్కరలేదు. ఆ సినిమా హీరో బాలకృష్ణ కు ఆంధ్ర టికెట్ రేట్ల మీద అభిప్రాయం ఓపెన్ గానే సర్క్యులేట్ అయింది.
ఆంధ్రలో బుక్ మై షో మీద ఏ అలజడి లేదు. కానీ నైజాంలో మాత్రం గడబిడ మొదలైంది. అసలే టికెట్ రేట్లు ఎక్కువ. సింగిల్ థియేటర్ లో సినిమా చూడాలంటే క్లాస్ టికెట్ రెండు వందలు దాటేస్తోంది. డిస్ట్రిబ్యూటర్లే టికెట్ రేట్లు తగ్గించి అమ్మమని థియేటర్లను కోరాల్సి వస్తోంది.
ఆంధ్ర(సీడెడ్ కాకుండా) కు నైజాంకు మధ్య జస్ట్ 20 నుంచి 25 శాతం తేడా వుంటుంది. కానీ ఇంత టికెట్ రేట్లు ఎక్కువ వున్న తెలంగాణలో భీమ్లా నాయక్ 36 కోట్లకు అమ్మితే, అంత తక్కువ రేట్లు వున్న ఆంధ్ర (సీడెడ్ కాకుండా) 40 నుంచి 45 కోట్ల రేషియోలో ఎలా అమ్మగలిగారు. ఎలా కిట్టుబాటు అవుతుందని కొన్నారు.
మొత్తం మీద ఆంధ్రలో సినిమా పరిశ్రమ ఇప్పుడు మళ్లీ ఫుల్ జోష్ లో వుంది. కొత్త టికెట్ రేట్లు వస్తే ఇక పగ్గాలు వుండదు.