మరిన్ని కార్యక్రమాలతో మళ్లీ అక్కడికి జగన్

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి విశాఖ టూర్ పెట్టుకున్నారు. సరిగ్గా వారం రోజులు కాలేదు జగన్ విశాఖకు మళ్లీ వచ్చేస్తున్నారు. ఈసారి కూడా సీఎం అనేక కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.  Advertisement అందులో…

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి విశాఖ టూర్ పెట్టుకున్నారు. సరిగ్గా వారం రోజులు కాలేదు జగన్ విశాఖకు మళ్లీ వచ్చేస్తున్నారు. ఈసారి కూడా సీఎం అనేక కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. 

అందులో ముఖ్యమైనవి భీమిలీలో ఫిష్ ల్యాండింగ్ సెంటర్, ఎండాడ వద్ద కాపు భవనానికి శంకుస్థాపన, విశాఖలో కమర్షియల్ కాంప్లెక్స్, ఎంవీపీ ఇండోర్ కాంప్లెక్స్ ఎరీనా ఫౌండేషన్ కి శ్రీకారం చుడతారు.

విశాఖ బీచ్ రోడ్డులో సీ హరియర మ్యూజియాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారు. అపోలో వారి క్యాన్సర్ ఆసుపత్రిని కూడా ఆయన ప్రారంభిస్తారు. విశాఖ వస్తూనే వైఎస్సార్ స్టేడియం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని జగన్ ఆవిష్కరిస్తారు.

ఈసారి కూడా అనేక కార్యక్రమాలతో ముఖ్యమంత్రి విశాఖలో ల్యాండ్ అవుతున్నారు. సీఎం టూర్ లో విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలుగుదేశం హయాంలో హామీగా ఉన్న కాపు భవనానికి సీఎం శంకుస్థాపన చేసి ఒక రూపం కల్పించడం ఈసారి టూర్ లో హైలెట్. 

భీమిలీకి చిరకాల కోరిక ఫిష్ ల్యాండింగ్ సెంటర్ ని ఏర్పాటు చేయడం మరో కీలక ఘట్టంగా చెప్పుకోవాలి. ముఖ్యమంత్రి జగన్ విశాఖ ఫోకస్ తో ఈ పనులన్నీ మెయిన్ లైన్ లోకి వచ్చి ఆచరణకు నోచుకుంటున్నాయని అంటున్నారు.