ఆదిపురుష్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలవుతోంది. ఈ సినిమాను తెలుగులో ప్రభాస్ సన్నిహిత మిత్రులు యువి సంస్థ అధినేతలు విడుదల చేస్తున్నారు.
యువి సంస్థలో ఆదిపురుష్ హీరో సోదరుడు కూడా భాగస్వామినే. ప్రభాస్-ఓం రౌత్ కాంబినేషన్ లో తయారైంది ఆదిపురుష్. సినిమా కీలకంగా యుద్దకాండ మీదే వుంటుంది. ఈ జనరేషన్ కు నచ్చేలా గ్రాఫిక్స్ ను వాడుతున్నారు. పాన్ ఇండియా స్టార్ కాస్ట్ వుంది.
ఇలాంటి సినిమా తెలుగు హక్కులు దాదాపు 150 కోట్ల పైమాటే అని తెలుస్తోంది. ఆంధ్ర, సీడెడ్, తెలంగాణ, కర్ణాటక కలిపి దాదాపు 150 కోట్ల మేరకు మార్కెట్ చేయాల్సి వుంది. ప్రభాస్ పాన్ ఇండియా లెవెల్ సినిమా అంటే ఇదేమీ పెద్ద ఎక్కువ మొత్తం కాదు. సలార్ లాంటి సినిమా వస్తే ఇంతకన్నా కాస్త ఎక్కువే వుంటుంది.
కేజిఎఫ్ 2 లాంటి సినిమా నైజాం కెపాసిటీ 70 కోట్లు. ఆ లెక్కన చూసుకుంటే ఆదిపురుష్ 150 కోట్ల టార్గెట్ పెద్ద కష్టం కాదు. పెద్ద సినిమాలు అన్నీ నైజాం 40 కోట్లకు కాస్త అటు ఇటుగా, ఆంధ్ర 50 కోట్లకు కాస్త అటు ఇటుగా వుంటున్నాయి.
ఇక సీడెడ్, కర్ణాటక వుండనే వుంటాయి. కానీ ఆదిపురుష్ జనరల్ సినిమా కాదు. మైథలాజికల్ సినిమా. హిట్ అయితే ఇళ్లలోంచి జనం బళ్లు చేసుకుని మరీ వచ్చి చూస్తారు. అందులో సందేహం లేదు. కానీ ఏమాత్రం డిస్సపాయింట్ అనిపించినా ఫలితం చాలా రివర్స్ లో వుంటుంది.
ఫలితం సంగతి ఎలా వున్నా సినిమాకు మాంచి సూపర్ ఓపెనింగ్ అయితే వుంటుంది. అందులో సందేహం లేదు.