గ‌వ‌ర్న‌ర్‌పై లైంగిక ఆరోప‌ణ‌ల దుమారం

అగ్ర‌రాజ్యం అమెరికాలో రాజ‌కీయ నేత‌ల‌పై లైంగిక ఆరోప‌ణ‌లు స‌ర్వ‌సాధార‌ణం. అమెరికా రాజ‌కీయాల్లో ఇలాంటివి ఒక భాగం అయ్యాయేమో అనే అనుమానం, అభిప్రాయం కొన్ని సంఘ‌ట‌న‌లు క‌లిగించ‌క‌మాన‌వు.  Advertisement గ‌త న‌వంబ‌ర్‌లో అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు కొన్ని…

అగ్ర‌రాజ్యం అమెరికాలో రాజ‌కీయ నేత‌ల‌పై లైంగిక ఆరోప‌ణ‌లు స‌ర్వ‌సాధార‌ణం. అమెరికా రాజ‌కీయాల్లో ఇలాంటివి ఒక భాగం అయ్యాయేమో అనే అనుమానం, అభిప్రాయం కొన్ని సంఘ‌ట‌న‌లు క‌లిగించ‌క‌మాన‌వు. 

గ‌త న‌వంబ‌ర్‌లో అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు కొన్ని రోజుల ముందు ప్ర‌స్తుత అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై లైంగిక ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. న్యూయార్క్‌లో యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ జరుగుతుండగా ట్రంప్ తన వీఐపీ సూట్‌లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని అమీ డోరిస్ అనే మ‌హిళ ఆరోపించారు. అప్పుడు త‌న వ‌య‌సు 24 ఏళ్లు, ట్రంప్ వ‌య‌సు 51 ఏళ్లు అని ఆమె చెప్పిన సంగ‌తి తెలిసిందే.

ట్రంప్ తన శరీరాన్ని అనుచితంగా తాక‌డంతో పాటు  బలవంతంగా ముద్దు పెట్టుకున్నారని ఆమె ఆరోపించారు. ఎన్నిక‌ల ముందు త‌న‌పై వ‌చ్చిన లైంగిక ఆరోప‌ణ‌లు ట్రంప్‌ను ఇబ్బంది పెట్టాయి.  

రాజకీయ దురుద్దేశంతోనే లైంగిక‌ ఆరోపణల చేశార‌ని ట్రంప్ అధికార ప్రతినిధులు బ‌దులిచ్చారు. గ‌తంలో బిల్‌క్లింట‌న్ అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్పుడు కూడా ఆయ‌న‌పై లైంగిక ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అప్ప‌ట్లో కొన్ని నెల‌ల పాటు ప్ర‌పంచ వ్యాప్తంగా బిల్‌క్లింట‌న్‌పై లైంగిక ఆరోప‌ణ‌ల చ‌ర్చే సాగింది.

తాజాగా న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమోపై ఆ రాష్ట్రానికి చెందిన మహిళా రాజకీయ నాయకురాలు లైంగిక ఆరోప‌ణ‌లు చేశారు.  కొన్నేళ్లపాటు ఆండ్రూ క్యూమో తనను లైగింకంగా వేధించారని లిండ్సే బోయ్లాన్ అనే మ‌హిళా నాయ‌కురాలు ట్విట‌ర్ వేదిక‌గా ఆరోపించారు. 

‘ఆండ్రూ క్యూమో అడ్మినిస్ట్రేషన్‌లో పని చేసిన కాలం నాటి మాట‌.  కొన్నేళ్ల పాటు ఆయన నన్ను లైంగికంగా వేధించాడు. ఈ విష‌యం చాలా మందికి తెలుసు. క్యూమో వంటి కొంత మంది పురుషులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడాన్ని నేను ద్వేషిస్తున్నా’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా క్యూమో అడ్మినిస్ట్రేషన్‌లో  2015 నుంచి 2018 వరకు లిండ్సే బోయ్లాన్ పని చేశారు. త‌న‌పై వ‌చ్చిన ఆరోపణలపై క్యూమో స్పందించక పోవ‌డం గ‌మ‌నార్హం. మౌనాన్ని అంగీకారం అనుకోవాలా? లేక ప‌స‌లేని ఆరోప‌ణ‌ల‌నే చుల‌క‌న భావ‌మా? అని నెటిజ‌న్లు ప్ర‌శ్నిస్తున్నారు. ఏది ఏమైనా మ‌హిళా నాయ‌కురాలి లైంగిక ఆరోప‌ణ‌లు అమెరికాలో దుమారం రేపుతున్నాయి.

పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం జగన్